Pakistan Fans: ఈనెల 19వ తేదీ నుండి పాకిస్తాన్, దుబాయ్ వేదికలలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ నిర్వహణకు దాయాది దేశం అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ క్రమంలోనే అప్ గ్రేడ్ చేసిన లాహోర్ లోని గడాఫీ స్టేడియాన్ని శుక్రవారం రోజు రాత్రి ఘనంగా ప్రారంభించారు. అలాగే అదే రోజు గడాఫీ స్టేడియంలో పాకిస్తాన్ జట్టు యొక్క కొత్త జెర్సీ లాంచ్ ఈవెంట్ ని కూడా నిర్వహించారు.
Also Read: India Wicketkeeper – Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పంత్ ఔట్.. రాహుల్ కే ఛాన్స్ !
ఈ వేడుకలో సంగీత ప్రదర్శనలు, పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ప్రఖ్యాత పాకిస్తానీ గాయకుడు అలీ జాఫర్, ఐమా బేగ్ పాటలతో అలరించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ కొత్త కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ తో పాటు ఇతర క్రికెటర్లందరూ నూతన జెర్సీని ధరించి స్టేడియంలో రచ్చ చేశారు. పాకిస్తాన్ క్రికెటర్లు మొదట జెర్సీ పైన స్వెటర్లు వేసుకుని స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత స్వెటర్లను విప్పేసి జెర్సీని రివీల్ చేశారు.
ఇక ఈ ఈవెంట్ కి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. అభిమానులను ఉచితంగా లోపలికి అనుమతించడంతో వేలాదిమంది తరలివచ్చారు. ఈ క్రమంలోనే మరోసారి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పై విమర్శలు వెళ్ళువెత్తాయి. స్టేడియం రీ ఓపెనింగ్, నూతన జెర్సీ లాంచ్ ఈవెంట్ కి తరలివచ్చిన కేవలం కొంతమందినే కంట్రోల్ చేయలేకపోయారని.. ఇది ఇలానే కొనసాగితే ఛాంపియన్ ట్రోఫీకి గా ఏం సెక్యూరిటీ ఇస్తారని పిసిబి పై మరోసారి ట్రోలింగ్ మొదలైంది.
ఉచిత ప్రవేశం కల్పించడంతో ప్రేక్షకులు స్టేడియంలోకి దూసుకు వచ్చిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో పాకిస్తాన్ క్రీడాభిమానులు ఒకరిపై మరొకరిపైకి ఎక్కి స్టేడియంలోకి దూసుకు వెళ్లడం కనిపిస్తోంది. దీంతో వీరిని ఆపేది ఎవరని, సిబ్బంది ఎటు వెళ్ళింది, పోలీసులు ఏం అయ్యారు..? అని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్లు. ఇక మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు వార్మప్ మ్యాచ్ లకు కూడా ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసింది.
Also Read: Pakistan Crickerts Fined: దూల తీర్చిన ICC…ముగ్గురు పాకిస్థాన్ ప్లేయర్లపై భారీ ఫైన్ !
ఫిబ్రవరి 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఛాంపియన్స్ ట్రోఫీ వార్మప్ మ్యాచ్ లు జరుగుతాయని ఐసీసీ ఓ షెడ్యూల్ ని విడుదల చేసింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఈ వార్మప్ మ్యాచ్ లు ఆడనున్నాయి. అయితే భారత జట్టు మాత్రం వీటికి దూరంగా ఉండనుంది. ఇక భారత జట్టు ఆడే మ్యాచ్ లు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో ప్రారంభమవుతాయి. ఇక ఫిబ్రవరి 23న భారత్ – పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు ఆడే మ్యాచ్ లు అన్నీ దుబాయ్ వేదికగానే జరగనున్నాయి.
VIP Entry in grand opening of Champions trophy in Pakistan 😂pic.twitter.com/W7hkXCpshN
— Out Of Context Cricket (@GemsOfCricket) February 13, 2025