BigTV English

KKR Vs CSK : టాస్ గెలిచిన కేకేఆర్.. తొలుత బ్యాటింగ్ ఎవరిదంటే..?

KKR Vs CSK : టాస్ గెలిచిన కేకేఆర్.. తొలుత బ్యాటింగ్ ఎవరిదంటే..?

KKR Vs CSK : ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చెపాక్ వేదికగా కెప్టెన్ గా మళ్లీ ధోనీ బాధ్యతలు స్వీకరించడంతో ఇప్పుడు మ్యాచ్ ఫలితం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలుత టాస్ చెన్నై కెప్టెన్ ధోనీ వేయగా.. కేకేఆర్ కెప్టెన్ రహానే చెప్పాడు. దీంతో రహానే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ధోనీ టాస్ గెలిచినా బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని చెప్పడం విశేషం.


చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఈ సీజన్ లో ఐదు మ్యాచ్ మ్యాచ్ లు ఆడితే.. కేవలం ఒకే ఒక్క విజయంతో పోరాడుతోంది. ఐపీఎల్ 2025లో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 9వ స్థానంలో కొనసాగుతోంది. రన్ రేట్ 0.889 ఉంది. ధోనీ కెప్టెన్ గా ఇవాళ తొలి మ్యాచ్ జరుగుతున్న వేళ ఈ జట్టు విజయం నమోదు చేసుకుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. చెన్నై బ్యాటర్లు నిలకడగా ఆడితే.. భారీ స్కోర్ సాధిస్తే మాత్రం విజయం తప్పకుండా దక్కుతుంది. అలా కాకుండా కోల్ కతా బౌలర్ల ధాటికి వికెట్లు కోల్పోతే మాత్రం చెన్నై కి చెపాక్ స్టేడియంలో వరుసగా మూడో ఓటమి తప్పదు. ఈ మ్యాచ్ కూల్ కెప్టెన్ కీలక వ్యూహాలు మాత్రం రచించి చెన్నైని విజయాలకు చేర్చే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు కేకేఆర్ జట్టు కూడా ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు ఆడి కేవలం రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి.. మూడు మ్యాచ్ లలో ఓటమిని చవి చూసింది. దీంతో ఇరు జట్లకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం అనే చెప్పాలి. తొలుత బ్యాటింగ్ చేసే చెన్నై  జట్టు సొంత మైదానంలో ఇవాళ భారీ స్కోర్ చేస్తుందా..? లేదా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. బౌలింగ్ విభాగంలో కేకేఆర్ జట్టులో స్పిన్నర్లు తమ ప్రతిభ చాటి త్వరగా వికెట్లు పడగొడితే కేకేఆర్ విజయం సునాయసం అవుతుంది. కానీ ఇప్పటికే 4 మ్యాచ్ ల్లో ఓటమితో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని పట్టు బిగించినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా రచిన్ రవీంద్ర, కాన్వె పవర్ ప్లే లో రాణిస్తే.. చెన్నై భారీ స్కోర్ సాధిస్తుంది. మరీ ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వేచి చూద్దాం.


 

చెన్నై సూపర్ కింగ్స్ : రచిన్ రవీంద్ర, డెవన్ కాన్వె, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివమ్ దూబె, ఎం.ఎస్. ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, అన్సుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్.

కోల్ కతా నైట్ రైడర్స్ : క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానె (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణ్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×