HCU : అంతన్నారు. ఇంతన్నారు. 48 గంటల్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చెబుతానన్నారు. రెండు రోజుల పాటు అందరి అటెన్షన్ డ్రా చేశారు. ఆఖరికి తుస్సు మనిపించారు. ప్రెస్ మీట్ అయితే పెట్టారు కానీ.. అందులో పస లేదు. ఇంకా ఉంది.. నెక్ట్స్ ఎపిసోడ్‌లో బయటపెడతానంటూ డైలీ సీరియల్‌లా వాయిదా వేశారు. కేటీఆర్ దగ్గర అసలు మేటర్ లేదని.. కంచ గచ్చిబౌలి భూముల వ్వవహారంలో మైండ్ గేమ్ ఆడుతున్నారని అంతా మండిపడుతున్నారు.
కేటీఆర్ మైండ్ గేమ్ తుస్స్..
HCU భూములను వేల కోట్లకు అమ్ముకోవాలని చూస్తున్నారనేది కేటీఆర్ ఆరోపణ. ఆ డీల్‌లో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారంటూ లీక్ ఇచ్చారు. ఆ పూర్తి వివరాలు రెండు రోజుల్లో బయటపెడతానంటూ ఇటీవల చెప్పారు. ముచ్చటగా మూడోరోజు మీడియా ముందుకు వచ్చారు. అంతా అటెన్షన్. కేటీఆర్ ఏం బ్రేకింగ్ న్యూస్ చెబుతారోననే టెన్షన్. ఆ బీజేపీ ఎంపీ ఎవరబ్బా అనే ఆతృత. వేల కోట్ల స్కాం ఏంటోనని ఉత్కంఠ. కానీ.. కేటీఆర్ నోట స్కాం లేదు.. ఆ బీజేపీ ఎంపీ పేరు కూడా రాలేదు.
బీజేపీ ఎంపీ అంటూ రాజకీయమా?
400 ఎకరాల భూకుంభకోణం జరిగిందని.. ఆ ల్యాండ్స్ కుదవపెట్టి భారీగా లోన్లు తీసుకొచ్చారని.. అవన్నీ అటవీ భూములని.. సమగ్ర దర్యాప్తు చేయాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖ రాశానని.. ఇలా రొటీన్ పొలిటికల్ స్టేట్‌మెంట్సే చేశారు కేటీఆర్. అంటే, ఆయన ఎలాంటి ఆధారాలు లేకుండానే అలా వేక్‌గా ఆరోపణలు చేశారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే తనదగ్గర ప్రూఫ్స్ ఉంటే అంత ఈజీగా వదిలేసే వారు కాదని.. నిజం లేకనే ఇలా సో సో గా ప్రెస్‌మీట్ ముగించేశారని చెబుతున్నారు. అటు, ఆ బీజేపీ ఎంపీ ఎవరో ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు. ఆయనకు తెలిసే ఉంటే చొప్పొచ్చుగా? మరోసారి చెబుతానంటూ వాయిదా వేయడం దేనికి? జనాల్లో ఆ భూముల టాపిక్ చుట్టూనే తిప్పేందుకేనా? అనే డౌట్ వ్యక్తం అవుతోంది.
Also Read : ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణ..
బిల్లి రావ్‌తో కేటీఆర్ డీల్?
అసలు స్కాం అంటూ జరిగితేగా అంటూ కాంగ్రెస్ సైతం ఎదురుదాడి చేస్తోంది. ఫార్ములా ఇ-కార్ రేసు కేసులో కేటీఆర్ రేపో మాపో అరెస్ట్ అవడం ఖాయమని.. అందుకే కేటీఆర్ అరెస్ట్‌ను HCUకు లింక్ చేసేందుకు ట్రై చేస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ మండిపడ్డారు. అవినీతికి కేరాఫ్ కేసీఆర్ కుటుంబమేనని అన్నారు. IMG సంస్థ యజమాని బిల్లీ రావుతో 30 శాతం కమిషన్‌కు.. 5 వేల కోట్లతో డీల్ మాట్లాడుకుంది కేటీఆరే అంటూ సంచలన ఆరోపణలు చేశారు పీసీసీ అధ్యక్షులు. హైదరాబాద్‌లోనే 10 వేల ఎకరాల భూమిని కేసీఆర్ హయాంలో అమ్మేశారని.. దమ్ముంటే ఆ భూముల అమ్మకంపై చర్చకు రావాలని సవాల్ చేసింది తెలంగాణ పీసీసీ.