Big Stories

KKR’s trouble stays in Varanasi: కోల్‌కతా ప్లేయర్స్‌కు ఇబ్బందులు, వారణాసిలో బస

KKR’s trouble stays in Varanasi: దేశవ్యాప్తంగా సోమవారం సాయంత్రం చాలా చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. అయితే వాతావరణం అనుకూలించని కారణంగా ఐపీఎల్ కోల్‌కత్తా ఆటగాళ్లకు ఇబ్బందులు తలెత్తాయి. భారీ వర్షంగా కారణంగా వీళ్లు ప్రయాణిస్తున్న చార్టర్డ్ ఫ్లయిట్‌కు ల్యాండింగ్ సమస్య తలెత్తింది. దీంతో రెండుసార్లు విమానాన్ని రూటు మళ్లించారు. అయినా వాతావరణంలో మార్పులు లేకపోవడంతో  చివరకు వారణాసిలో రాత్రి బస చేశారు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

ఆదివారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ విజయం సాధించింది. సోమవారం సాయంత్ర లక్నో నుంచి కోల్‌కత్తాకు బయలుదేరింది కేకేఆర్ టీమ్. ఈనెల 11న ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై-కోల్‌కత్తా మధ్య మ్యాచ్ జరగనుంది. సోమవారం సాయంత్రం లక్నోలో దాదాపు ఐదున్నరకు కేకేఆర్ ఆటగాళ్లు ఛార్డర్డ్ విమానంలో కోల్‌కతాకు బయలుదేరారు.

- Advertisement -

విమానం ఏడున్నరకు ల్యాండ్ కావాల్సి ఉండగా, సోమవారం కుండపోత వర్షం పడింది. దీంతో విమానం ల్యాండింగ్‌కు సరైన వాతావరణం అనుకూలించలేదు. దీంతో విమానాన్ని తొలుత గౌహతికి దారి మళ్లించారు. కొద్దిసేపు ఆగిన తర్వాత అక్కడి నుంచి మళ్లీ కోల్‌కత్తాకు బయలుదేరింది. వాతావారణంలో ఎలాంటి మార్పులు లేవు. విమానాన్ని మరోసారి దారి మళ్లించి ఈసారి వారణాసిలో ల్యాండ్ అయ్యింది. ఆటగాళ్లు రాత్రంతా అక్కడే బస చేశారు. కొద్దిసేపటి కిందట ఆటగాళ్లు తిరిగి కోల్‌కతాకు బయలుదేరారు.

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News