Big Stories

Jagan Comments: ఆ సైకిల్‌కు హ్యాండిల్ లేదు.. చక్రాలు లేవు, పెడల్స్ లేవు: జగన్

Jagan Comments on Chandrababu: ఆ సైకిల్ కు హ్యాండిల్ లేదు.. చక్రాలు లేవు, పెడల్స్ లేవు.. ఎన్ని రిపేర్లు చేసినా లాభం లేదు.. సైకిల్ లో పనిచేసే ఒకే ఒక్క పార్ట్ బెల్.. అది మేనిఫెస్టోలోని అబద్ధాలను ప్రచారం చేస్తుందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం రాజనగరం నియోజకవర్గంలోని కోరుకొండలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. తుప్పు పట్టిన సైకిల్ కు రిపేర్ చేయించాలని చంద్రబాబు అవస్థలు పడుతున్నారన్నారు. సైకిల్ రిపేర్ చేయడానికి దత్త పుత్రుడిని ఆశ్రయించినా ఫలితం రాలే.. ఆ తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపి సైకిల్ రిపేర్ కు చంద్రబాబు యత్నాలు చేశారు.. ఢిల్లీ మెకానిక్ లు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు.. సైకిల్ కు ఎన్ని రిపేర్లు చేసినా లాభం లేదు.. ఆ సైకిల్ కు హ్యాండిల్ లేదు.. చక్రాలు లేవు, పెడల్స్ లేవు.. సైకిల్ లో పనిచేసే ఒకే ఒక్క పార్ట్ బెల్.. అది మేనిఫెస్టోలోని అబద్ధాలను ప్రచారం చేస్తుందని ఆయన అన్నారు.

- Advertisement -

మేనిఫెస్టోతో ఊదరగొడుతున్న చంద్రబాబు గతంలో ఎన్ని హామీలు నెరవేర్చావంటూ ప్రశ్నించారు. ఢిల్లీ వాళ్లతో కుట్రలు చేయిస్తూ పథకాలు ఆపుతున్నారని ఆయన ఆరోపించారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకం పేరైనా గుర్తొస్తుందా? అని ఆయన అన్నారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చామని జగన్ అన్నారు.

‘రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును ఈ ఎన్నికలు నిర్వహిస్తాయి. పొరపాటున చంద్రుబాబుకు ఓటు వేస్తే చంద్రబాబును నిద్రలేపడమే అవుతుంది. టీడీపీకి ఓటు వేస్తే పతకాల ముగింపే. 59 నెలలో ఎప్పుడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాం. ఐదేళ్లలో 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం. అవ్వాతాతలకు ఇంటికే రూ. 3 వేల పెన్షన్, రేషన్, పౌర సేవలు. నాడు-నేడుతో ప్రభుత్వ బడులు బాగుపడ్డాయి. పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, ఆర్బీకే వ్యవస్థ. స్వయం ఉపాధికి అండగా నిలిచాం. రైతు రుణమాఫీ, పొదుపు సంఘాల రుణాల మాఫీ చేశాం. వివధ పథకాల ద్వారా రూ. 2.70 లక్షల కోట్లను డీబీటీ ద్వారా అందించాం. ఏ పథకం ఎప్పుడు వస్తుందో.. ఏకంగా క్యాలెండర్ ఇచ్చింది మీ బిడ్డనే పాలనలోనే. మళ్లీ జగనే వస్తాడు.. మీ పథకాలన్నీ అందిస్తాడు’ అంటూ ఆయన పేర్కొన్నారు.

‘టీడీపీ వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకోండి.. అవి మీ దగ్గర నుంచి దోచుకున్న డబ్బే. కానీ, ఎవరు అధికారంలో ఉంటే మంచి జరుగుతుందోననేది మీ ఇంట్లో చర్చించి ఓటేయండి’ అంటూ జగన్ అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News