Big Stories

KL Rahul Breaks MS Dhoni Record: ధోని రికార్డ్ బ్రేక్ చేసిన కేఎల్ రాహుల్..!

KL Rahul Breaks MS Dhoni Record: ఐపీఎల్ క్రికెట్ లో ఎన్నో రికార్డులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొత్త నీరు వచ్చినప్పుడల్లా పాత నీరు పోతుంది.. అని గోదావరి జిల్లాల్లో ఒక సామెత ఉంది. అలాగే సీనియర్స్ నెలకొల్పిన రికార్డులు తర్వాత జనరేషన్ వచ్చి, వాటిని దాటేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు ధోనీ రికార్డ్ ఒకటి చెరిగిపోయింది.

- Advertisement -

విషయం ఏమిటంటే ఐపీఎల్ లో అత్యధిక ఆఫ్ సెంచరీలు సాధించిన వికెట్ కీపర్ గా మహేంద్ర సింగ్ ధోనీ (24) రికార్డు ఒకటి మొన్నటి వరకు పదిలంగా ఉంది. కానీ ఇప్పుడు కేఎల్ రాహుల్ దానిని దాటి వెళ్లాడు. లక్నో వర్సెస్ చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ లో 82 పరుగులు చేసిన రాహుల్ మ్యాచ్ ని గెలిపించడంతో పాటు వికెట్ కీపర్ గా అత్యధికంగా ఆఫ్ సెంచరీలు సాధించిన రికార్డు అందుకున్నాడు.

- Advertisement -

ప్రస్తుతం రాహుల్ 25 ఆఫ్ సెంచరీలు చేసి నెంబర్ వన్ గా ఉన్నాడు. ఇవన్నీ 125 మ్యాచ్ ల్లోనే సాధించడం విశేషం. తర్వాత చూస్తే మహేంద్ర సింగ్ ధోనీ 257 మ్యాచ్ ల్లో 24 చేశాడు. ఇక క్వింటన్ డికాక్ అయితే 103 మ్యాచ్ ల్లో 23 చేశాడు. దినేశ్ కార్తీక్ 249 మ్యాచ్ ల్లో 21, రాబిన్ ఉతప్ప 205 మ్యాచ్ ల్లో 18 ఆఫ్ సెంచరీలు చేశారు.

Also Read: చెలరేగిన రాహుల్.. సునాయాసంగా గెలిచిన లక్నో..

మొత్తానికి లక్నోలో ఇద్దరు వికెట్ కీపర్లు వారే, ఇద్దరు ఓపెనర్లు వారే కావడం విచిత్రమే అనిచెప్పాలి. ఎందుకంటే సౌతాఫ్రికా వికెట్ కీపర్ గా ఉన్న డికాక్, టీమ్ ఇండియాలో వికెట్ కీపర్ గా ఉన్న కేఎల్ రాహుల్ ఇద్దరూ లక్నోలో ఉండటమే కాదు, ఇద్దరూ ఓపెనర్లుగా రావడం విశేషమే అని చెప్పాలి. వీరిద్దరూ కూడా ఈ మ్యాచ్ లో ఆఫ్ సెంచరీలు చేయడం విశేషం.

ఏదేమైనా మొత్తానికి లక్నో సూపర్ జెయింట్స్ ఎట్టకేలకు విజయం సాధించి రేస్ లోకి వచ్చిందనే చెప్పాలి. ఇంతకాలానికి కేఎల్ రాహుల్ మళ్లీ టచ్ లోకి రావడంతో రాబోవు రాజుల్లో లక్నో జెట్ స్పీడుతో వెళుతుందని అందరూ అనుకుంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News