BigTV English

Kohli – RCB: కోహ్లీ జెర్సీ సెంటిమెంట్.. ఈసారి RCB కప్పు కొట్టడం గ్యారంటీ?

Kohli – RCB: కోహ్లీ జెర్సీ సెంటిమెంట్.. ఈసారి RCB కప్పు కొట్టడం గ్యారంటీ?

Kohli – RCB: క్రికెట్ లో సెంటిమెంట్లు కూడా చాలా విషయాలను డిసైడ్ చేస్తాయి. ఇలా క్రికెట్ లో ఇప్పటికే మీరు చాలా సెంటిమెంట్లు వినే ఉంటారు. గతంలో సచిన్ టెండుల్కర్ బ్యాటింగ్ కి వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఎడమ కాలికి ముందుగా ప్యాడ్స్ కట్టుకుంటాడని, అనిల్ కుంబ్లే బౌలింగ్ వేసేటప్పుడు సచిన్ కి తన క్యాప్ ఇస్తాడని.. ఇలా క్రికెటర్లకు కూడా కొన్ని సెంటిమెంట్లు ఉండేవి. అయితే ప్రస్తుతం టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ గురించి ఓ సెంటిమెంట్ వైరల్ గా మారింది.


Also Read: Kishan- Rizwan: రిజ్వాన్ ఇజ్జత్ తీసిన ఇషాన్ కిషన్ !

వాస్తవానికి జెర్సీ నెంబర్ 18 అనగానే క్రికెట్ ప్రపంచంలో వెంటనే గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గత 17 సీజన్లుగా విరాట్ కోహ్లీ ప్రతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా మైదానంలోకి దిగిన ప్రతిసారి కూడా కింగ్ కోహ్లీ 18 నెంబర్ ఉన్న జెర్సీని ధరించి ఉంటాడు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ లో.. గత 17 సీజన్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కప్ సాధించలేదు.


కానీ ప్రస్తుతం జరుగుతున్నది 18వ సీజన్. కాగా విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18. ఈ నేపథ్యంలో ఈ రెండు కూడా 18 కావడంతో కోహ్లీ అభిమానులు కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. ఈ 18వ సీజన్ లో ఆర్సీబీ ఛాంపియన్ అవుతుందని జోష్యం చెబుతున్నారు. మరి ఆర్సిబి అభిమానులు అంచనా వేసిన విధంగానే ఈసారి ఆ జట్టు కప్పు సాధిస్తుందా..? లేదా..? అన్నది వేచి చూడాలి.

అయితే విరాట్ కోహ్లీ తన కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటివరకు తన సంఖ్యను మార్చుకోలేదు. ఎందుకంటే దీని వెనుక ఓ ఉద్వేగభరితమైన కథ ఉందట. అది తన తండ్రి గుర్తుగా విరాట్ కోహ్లీ ఈ 18 నెంబర్ జెర్సీ ధరిస్తున్నాడు. విరాట్ కోహ్లీ తన 17 ఏళ్ల వయసులో అతడి తండ్రి ప్రేమ్ కోహ్లీ 2006 డిసెంబర్ 18వ తేదీ తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ ఢిల్లీ తరఫున కర్ణాటకతో రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు.

 

ఆ సమయంలో ఓ పక్క తండ్రి మరణించినా.. కుటుంబ సభ్యులు అండగా నిలవడంతో తన దుఃఖాన్ని దిగమింగుకొని ఆ రోజు మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ ఏకంగా 90 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం తన తండ్రి అంత్యక్రియలలో పాల్గొన్నారు. అందుకే తన తండ్రి మరణించిన రోజు గుర్తుగా జెర్సీ నెంబర్ 18 ని ఎంచుకున్నానని తెలిపాడు విరాట్ కోహ్లీ. అనంతరం ఇదే 18 నెంబర్ జెర్సీతో అండర్-19 జట్టుకి కెప్టెన్ గా భారత్ కి ప్రపంచ కప్ అందించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ టీమ్ ఇండియా జట్టులో చేరే సమయంలో అదృష్టవశాత్తు జెర్సీ నెంబర్ 18 ఖాళీగా ఉంది. దీంతో ఎలాంటి సమస్య లేకుండా విరాట్ కి ఆ నెంబర్ దక్కింది.

Tags

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×