BigTV English

Kishan- Rizwan: రిజ్వాన్ ఇజ్జత్ తీసిన ఇషాన్ కిషన్ !

Kishan- Rizwan: రిజ్వాన్ ఇజ్జత్ తీసిన ఇషాన్ కిషన్ !

Kishan- Rizwan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 17 సీజన్లకు అంపైర్ గా సేవలందించిన అనిల్ చౌదరి.. ఈ సీజన్ లో కొత్త అవతారం ఎత్తారు. 60 ఏళ్ళు నిండిన తర్వాత ఆయన అంపైరింగ్ కి వీడ్కోలు పలుకుతూ ఇప్పుడు వ్యాఖ్యాతగా మారారు. ఫిబ్రవరి నెలలో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ చివరి దేశీయ మ్యాచ్ కాగా.. సెప్టెంబర్ 2023లో అంతర్జాతీయ క్రికెట్ లో చివరిసారిగా అంపైర్ గా వ్యవహరించారు.


Also Read: Rahul Dravid: వీల్‌చైర్‌లో గ్రౌండ్‌లోకి వచ్చి… ద్రావిడ్ కష్టాలు చూడండి !

తన కెరీర్లో మొత్తం 12 టెస్టులు, 49 వన్డేలు, 64 టీ-20 మ్యాచ్ లకి అంపైర్ గా సేవలందించారు అనిల్ చౌదరి. అయితే ఆ మధ్య టీమిండియా క్రికెటర్ ఇషాన్ కిషన్, అంపైర్ అనిల్ చౌదరి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఇషాన్ కిషన్ తో ఆయన చేసిన సంభాషణ చర్చనీయాంశంగా మారింది. ఈ ఐపీఎల్ సీజన్ లో తన తొలి మ్యాచ్ లోనే ఇషాన్ కిషన్ 106 పరుగులు చేసి అద్భుతమైన సెంచరీని సాధించిన విషయం తెలిసిందే.


అయితే ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియోలో వికెట్ కీపింగ్ సమయంలో వేగంగా ఉండే పాకిస్తాన్ వన్డే కెప్టెన్, వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ పై ఇషాన్ కిషన్ విమర్శలు గుప్పించాడు. ఆ వీడియోలో ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. ” పాకిస్తాన్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ కి అతిగా ఆప్పిల్ చేసే అలవాటు ఉంది. అతిగా ఆప్పీల్ చేస్తే అంపైర్లు స్పష్టమైన అవుట్ లను రద్దు చేయడం ప్రారంభించవచ్చు.

మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా తన నిర్ణయం తీసుకోవడంలో వికెట్ కీపింగ్ విషయంలో ఉన్నత ప్రమాణాలను నిర్దేశించుకున్నాడు. కానీ కొంతమంది వికెట్ కీపర్లు అతిగా అప్పీల్ చేస్తారు. వారిలో మహమ్మద్ రిజ్వాన్ కూడా ఉన్నాడు. అతను ఎక్కువసార్లు అప్పీల్ చేసినప్పటికీ.. వాటికి ఎప్పుడూ మంచి స్పందన లభించలేదు. అంపైర్లు మరింత తెలివిగా మారి.. వికెట్ కీపర్లు అతిగా ఆప్పీల్ చేస్తే స్పష్టమైన డిస్మిసల్స్ ని తిప్పి కొట్టడం ప్రారంభించవచ్చు” అని అన్నాడు. అనంతరం ఈ వీడియోలో అనిల్ చౌదరి.. ఇషాన్ కిషన్ ని ప్రశంసిస్తూ..

 

“ఇషాన్ కిషన్ ఇప్పుడు పరిణితి చెందిన ఆటగాడిగా మారాడు. గతంలో వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో చాలా అప్పీల్ చేసేవాడు. కానీ ఇప్పుడు అలా చేయడం లేదు. ఈ మార్పు ఎలా వచ్చింది” అని ఇషాన్ కిషన్ ని అనిల్ చౌదరి అడగాగా.. దానికి ఇషాన్ కిషన్ పై విధంగా బదులిచ్చాడు. అంపైర్లు తెలివైన వారు అయ్యారని.. ప్రతిసారి అప్పీల్ చేస్తే అంపైర్ అవుట్ కూడా నాట్ అవుట్ లా ఇస్తారని చెప్పుకొచ్చాడు. ఇక ఇషాన్ కిషన్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. అతడు తన ఐపిఎల్ కెరీర్ లో 3 వేల పరుగులు చేయడానికి చాలా దగ్గరగా ఉన్నాడు. ఇందుకు అతడికి ఇంకా 250 పరుగులు కావాలి.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×