BigTV English

Robin Uthappa on IPL Bidding: ఆ ఒక్కటీ లేకపోతే.. ఒకొక్కరికి రూ.100 కోట్లు: రాబిన్ ఉతప్ప

Robin Uthappa on IPL Bidding: ఆ ఒక్కటీ లేకపోతే.. ఒకొక్కరికి రూ.100 కోట్లు: రాబిన్ ఉతప్ప

Robin Uthappa Latest Cricket News


Robin Uthappa Latest Cricket News: మారో కొద్దిరోజుల్లో ప్రపంచంలోనే అత్యంత భారీ లీగ్ మ్యాచ్ అయిన ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ సీజన్ 2024 పై మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ నిజానికి ఐపీఎల్ లో ఫ్రాంచైజీ నిబంధనలు లేకపోతే మన టీమ్ ఇండియా క్రికెటర్లు ఒకొక్కరిని రూ.100 కోట్లకైనా కొంటారని సంచలన ప్రకటన చేశాడు. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో విరాట్ కొహ్లీ జట్టు అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.

ఈసారి జట్టులో ఇద్దరు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లను ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరలకు కొనుగోలు చేశారు. మిచెల్ స్టార్క్ ను కోల్ కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లకు, పాట్ కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ .20.50 కోట్లకు కొనుగోలు చేశాయి.


ఈ సందర్భంగానే రాబిన్ ఉతప్ప మాట్లాడాడు. ఒకవేళ ఐపీఎల్ లో ఫ్రాంచైజీలకు కళ్లెం వేయకపోతే, నిబంధనలు విధించకపోతే ఐపీఎల్ సినిమా మామూలుగా ఉండదని అన్నాడు. అదేగానీ జరిగితే టీమ్ఇండియాలో టాప్ 10 ప్లేయర్లు ఒకొక్కరు రూ.100 కోట్లు పలుకుతారని అన్నాడు. కానీ ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒకొక్క ఫ్రాంచైజీ ఆటగాళ్లు అందరికీ కలిపి రూ. 100 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టాలని నిబంధన ఉంది.

Also Read: ఏటికి ఎదురీదుతున్న విదర్భ.. 248 / 5 విజయానికి దగ్గరలో ముంబయి

దాంతో ఫ్రాంచైజీలు ఏం చేస్తున్నాయంటే, గేమ్ ఛేంజర్స్ ఎవరైతే ఉంటారో అలాంటివారు ఒకరిద్దరిని తీసుకుంటున్నారు. వాళ్లకి ఎక్కువ మొత్తం పెడుతున్నారు. ఈ విషయంలో రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ ఒకొక్క ఫ్రాంచైజీకి రూ.500 కోట్లు, రూ.1000 కోట్లు లిమిట్ పెడితే, ఆటగాళ్లకు భారీ రెమ్యునరేషన్లు ఉంటాయని తెలిపాడు.

అలా జరిగితే మన పేపర్ బుమ్రా, విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైశ్వాల్, గిల్ వీరందరూ రూ.100 కోట్లు దాటే పలుకుతారని అన్నాడు. ఇక కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్ వీళ్లందరూ కనీసం రూ.80 కోట్లు ఉంటారని తన అంచనాగా తెలిపాడు.

ఉతప్ప మాట్లాడిన మాటలపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇండియా టెస్టు జట్టులో ఆడటానికి ఆటగాళ్లు ఇష్టపడటం లేదు. ఇంక డబ్బులు ఎక్కువిస్తే మొత్తం ఎవడూ ఆడడని, జాతీయ క్రికెట్ సర్వ నాశనమై పోతుందని అంటున్నారు. ఇంకెవడూ దూర ప్రాంతాలకు వెళ్లరు. సంవత్సరానికి ఒకసారి ఐపీఎల్ ఆడితే చాలనుకుని సైడ్ బిజినెస్ లు చేసుకుంటారని అంటున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×