BigTV English

TG Govt Notices to My Home: భూదాన్‌ భూముల అక్రమాలపై టీఎస్ సర్కార్ కొరడా.. మైహోమ్, కీర్తి సిమెంట్స్ కు నోటీసులు!

TG Govt Notices to My Home: భూదాన్‌ భూముల అక్రమాలపై టీఎస్ సర్కార్ కొరడా.. మైహోమ్, కీర్తి సిమెంట్స్ కు నోటీసులు!

TG Govt Notices to My Home constructions


TG Govt Notices to My Home: భూదాన్‌ భూముల్లో అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝలిపించింది. భూదాన్‌ భూములు ఆక్రమించిన వారికి కాంగ్రెస్ సర్కార్ షాక్‌ ఇచ్చింది. మైహోమ్ సహా మరో నలుగురికి నోటీసులు జారీ చేసింది. ఆక్రమిత 150 ఎకరాల భూదాన్‌ భూములు ఖాళీ చేయాలంటూ.. భూదాన్‌ చట్టం సెక్షన్‌ 24A ప్రకారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ భూముల్లో పదేళ్లుగా మైహోమ్ సంస్థ భారీ నిర్మాణాలు చేపట్టింది. భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్.

హుజూర్ నగర్ మెళ్ల చెరువు గ్రామ పంచాయితీ పరిధిలో భూదాన్ భూమి ఆక్రమించుకుని సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. 113 ఎకరాలు మై హోమ్, 18 ఎకరాలు కీర్తి సిమెంట్స్, 21.5 ఎకరాలు కీర్తి సిమెంట్ ఎండి పేరుతో పాటు.. మరో ఇద్దరు రైతుల పేరుమీద 3 ఎకరాలు ఆక్రమణకు గురైందని నోటీసులు జారీ చేశారు. దీనిపై ఈనెల 16న CCLA కు హాజరు కావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సర్వే నెంబర్ 1057లోని 160 ఎకరాల్లో.. 150 ఎకరాల భూదాన్ భూములు ఆక్రమణ గురైనట్లు ప్రభుత్వం గుర్తించింది.


Also Read: కొత్త స్కీమ్ ప్రకటించిన కేంద్రం.. ఈ వాహనాల కొనుగోళ్లపై భారీ సబ్సిడీ..

అక్రమంగా భూకబ్జా చేసి నిర్మించిన సిమెంట్ పరిశ్రమలకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నోటీసులు పంపారు. భూదాన్ ఉద్యమంలో సేకరించిన భూములను అక్రమంగా కబ్జా చేసినట్లు గుర్తించారు. మై హోమ్ సిమెంట్ పరిశ్రమకు నోటీసులు జారీ చేశారు. అక్రమంగా ఆక్రమించిన 150 ఎకరాల భూదాన్ భూములను ఖాళీ చేయాలని షోకాజ్ నోటీసులు పంపారు. మైహోమ్ సహా మరో నలుగురికి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నోటీసులు జారీ చేశారు.

గత పదేళ్లుగా మేళ్లచెరువు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1057లో 150 ఎకరాల భూదాన్ భూమి అక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఉన్న 113 ఎకరాల భూదాన్ భూమిని మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ, కీర్తి సిమెంట్ ఫ్యాక్టరీ 18.20 ఎకరాలు, మరో ఇద్దరు రైతులు 3.19 ఎకరాల భూమిని కబ్జా చేశారు. ఈ నలుగురికీ భూదాన్ గ్రామ్ దాన్ చట్టం సెక్షన్ 24ఏ ద్వారా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు వివరణ ఇవ్వాల్సిందిగా ఈ నెల 16న సీసీఎల్ఏ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.

Tags

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×