Nz vs Ind: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament ) నేపథ్యంలో… కాసేపటికి క్రితమే టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( Team India vs New Zealand ) మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా కష్టాల్లో పడింది. 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా… చాలా కష్టంగా ఇవాళ బ్యాటింగ్ చేస్తుంది. మొన్నటి వరకు బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్ జట్లపైన దుమ్ము లేపిన టీమిండియా ప్లేయర్లు… న్యూజిలాండ్ వచ్చేసరికి తేలిపోయారు. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ ఇద్దరు తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు.
Also Read: Inzamam on IPL: IPL పై పాకిస్థాన్ కుట్రలు.. బాయ్‌కాట్ చేయాలంటూ ?
ఇక పాకిస్తాన్ పైన సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ మళ్లీ ఇవాళ రాణిస్తారని అందరూ అనుకున్నారు. కానీ విరాట్ కోహ్లీ (Virat Kohli ) కూడా… తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. 14 బంతుల్లోనే 11 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రెండు బౌండరీలు కొట్టాడు. ఆ తర్వాత మాట్ హెన్రీ బౌలింగ్ లో గ్లెన్ ఫిలిప్స్ ( Glenn Phillips ) అద్భుతమైన క్యాచ్ పట్టడంతో విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పెవిలియన్ వెళ్ళిపోయాడు. అయితే విరాట్ కోహ్లీ క్యాచ్ అవుట్ చూసిన అనుష్క శర్మ.. నోరేళ్ల బెట్టి చూశారు. దీంతో అనుష్క శర్మ ( Anushka Sharma ) రియాక్షన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా.. మారడం జరిగింది. అలాగే గ్లెన్ ఫిలిప్స్ అందుకున్న విరాట్ కోహ్లీ క్యాచ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అంతేకాదు విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత… అతని అవుట్ పై రవీంద్ర జడేజా క్లారిటీ ఇస్తున్న విజువల్స్ కూడా వైరల్ గా మారాయి. న్యూజిలాండ్ ఆటగాడు ఫిలిప్స్…. డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడని విరాట్ కోహ్లీకి క్లారిటీ ఇచ్చాడు జడేజా. ఇక జడేజా ఇచ్చిన క్లారిఫికేషన్ పైన విరాట్ కోహ్లీ కూడా షాకింగ్ రియాక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన విజువల్స్… కెమెరాలో చిక్కాయి.
ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ… 17 బంతుల్లో 15 పరుగులు చేయగా అందులో ఒక బౌండరీ అలాగే ఒక సిక్సర్ ఉంది. గిల్ 7 బంతులు ఆడి 2 పరుగులు మాత్రమే తీశాడు. విరాట్ కోహ్లీ 14 మంత్రులు 11 పరుగులు చేయడం జరిగింది. అయితే 30కే మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన అక్షర్ పటేల్ 42 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ 52 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. కాసేపటి క్రితమే రచిన్ రవీంద్ర బౌలింగ్ లో అక్షర్ పటేల్… కేన్ మామ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కు దిగాడు. 30 ఓవర్ల సమయానికి… నాలుగు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా… 130 పరుగులు చేయగలిగింది. కేఎల్ రాహుల్ అలాగే శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ కన్సిస్టెంట్గా ఆడితే… 250కి పైగా పరుగులు చేయవచ్చు.
Also Read: Saqlain Mushtaq: మగాళ్లైతే పాకిస్థాన్ వచ్చి ఆడండి.. టీమిండియాకు సవాల్ ?
Glenn Phillips, what a catch! 🤯🔥
That was pure magic in #ChampionsTrophy2025—one of the best ever! 😍💯#INDvsNZ pic.twitter.com/VJUlCWwuYa
— Atul Chanpuriya (@atulchanpuriya) March 2, 2025