KKR Performs Pooja: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 18వ ఎడిషన్ కి రంగం సిద్ధమైంది. మార్చి 22న ఐపీఎల్ 18వ సీజన్ మొదలు కాబోతోంది. మెగా ఐపీఎల్ వేలం తరువాత టీమ్ లలో కీలక మార్పులు జరిగాయి. చాలా జట్లు కొత్త కెప్టెన్లతో టైటిల్ వేటకు దిగుతున్నాయి. పది జట్లు తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ సెషన్స్ మొదలు పెట్టేశాయి. ఈ సీజన్ కోసం కలకత్తా నైట్ రైడర్స్ కూడా అప్పుడే క్యాంప్ స్టార్ట్ చేసేసింది.
Also Read: Danish Kaneria: మతం మారమని బలవంతం చేసేవారు… డానిష్ కనేరియా హాట్ కామెంట్స్!
గత సంవత్సరం ఐపీఎల్ విజేతగా నిలిచింది కలకత్తా నైట్ రైడర్స్. తద్వారా మూడవసారి టైటిల్ ని కైవసం చేసుకుంది. ఇక ఈసారి లీగ్ ఆరంభ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో కలకత్తా తలపడబోతోంది. సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్ లో మార్చి 22న ఈ మ్యాచ్ జరగబోతోంది. గత సంవత్సరం జట్టును ముందుండి నడిపించిన శ్రేయస్ అయ్యర్ ఈసారి తప్పుకోవడంతో అతడి స్థానంలో అనుభవజ్ఞుడైన అజింక్య రహనే బాధ్యతలు స్వీకరించాడు.
దీంతో నైట్ రైడర్స్ కొత్త తరహా జట్టుతో ఈసారి రంగ ప్రవేశం చేయబోతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ టైటిల్ ని నిలబెట్టుకోవాలన్న ఆశాభావంతో ఉంది నైట్ రైడర్స్. తాజాగా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన పూజా కార్యక్రమంలో కెప్టెన్ అజింక్య రహానే కొబ్బరికాయ కొట్టి మరీ ప్రాక్టీస్ సెషన్ ని ప్రారంభించాడు. కలకత్తా నైట్ రైడర్స్ జట్టు ఆటగాళ్లంతా దాదాపు కలకత్తాకి చేరుకున్నారు. మొదట కెప్టెన్ అజింక్య రహానే అడుగుపెట్టగా.. ఆ తరువాత సౌత్ ఆఫ్రికా దిగ్గజాలు క్వింటన్ డికాక్, నోకియా వచ్చారు.
విదేశీ ఆటగాళ్లు కూడా దాదాపు అందరూ చేరుకున్నారు. ముఖ్యంగా కరేబియన్ ప్లేయర్లు సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, పావెల్ కలకత్తా నైట్ రైడర్స్ క్యాంపులో కాలు పెట్టారు. ఇక స్వదేశీ ఆటగాళ్లు వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, మనీష్ పాండే అంకుల్ రాయ్, రఘువంశీ ప్రాక్టీస్ లో కనిపించారు. ఇక ప్రాక్టీస్ ప్రారంభం సందర్భంగా పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టి, వికెట్లకి పూలదండ వేసి సందడి చేశారు కలకత్తా ప్లేయర్స్.
Also Read: Shikhar Dhawan: కొత్త లవర్ తో శిఖర్ ధావన్.. వీడియో వైరల్ ?
దీంతో ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో కలకత్తా నైట్ రైడర్స్ జట్టు 2012, 2014, 2024 లతో కలిపి మూడు ట్రోఫీలను గెలుచుకుంది. నూతన కెప్టెన్ తో డిపెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగనున్న కలకత్తా జట్టు ఈ సీజన్ లో ఏ విధంగా రాణిస్తుందో వేచి చూడాలి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">