Shikhar Dhawan: టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఏళ్లపాటు భారత జట్టుకు ప్రతినిత్యం వహించిన శిఖర్ ధావన్.. పరుగుల వరద పారిస్తూ భారత జట్టు విజయాలలో కీలకపాత్ర పోషించాడు. ఎన్నో మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించాడు. ఏప్పుడు ఫిట్ గా ఉండే ధావన్.. బరిలోకి దిగితే బౌలర్ల బెండు తీసేవాడు. భారీ షాట్లతో విరుచుకుపడేవాడు. అందుకే అతడిని గబ్బర్ అని కూడా పిలుస్తూ ఉంటారు అభిమానులు.
Also Read: Danish Kaneria: గ్రేట్ రాహుల్ ద్రావిడ్.. టీం కోసం గాయం కూడా లెక్క చేయలేదు ?
ఇంటర్నేషనల్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఇంకా పలు టి-20 లీగ్స్ ఆడుతూ బిజీగా ఉన్నాడు శిఖర్ ధావన్. బయట చూసేందుకు బలశాలిగా కనిపించే ధావన్.. లోలోపల మాత్రం తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నాడు. ఇందుకు కారణం కొడుకు జోరావర్ ని అతడికి దూరం చేయడమేనట. విడాకుల తర్వాత ధావన్ కుమారుడు అతడి తల్లి ఆయేషా ముఖర్జీ వద్ద ఉంటున్నాడు. ఆస్ట్రేలియాకి చెందిన ఆయేషా ముఖర్జీని దావన్ పెళ్లాడిన విషయం తెలిసిందే.
అప్పటికే ఆమెకు మొదటి భర్తతో ఇద్దరూ ఆడపిల్లలు జన్మించగా.. వారిని కూడా తన కూతుర్లుగానే ధావన్ స్వీకరించాడు. ఇక ఆయేషాతో ధావన్ కి ఒక కుమారుడు కలిగాడు. ఈ జంట ఎంతో అన్యోన్యంగా కనిపించేవారు. అయితే అభిప్రాయ బేధాలు తారస్థాయికి చేరడంతో 2023లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఒరావర్ ని తీసుకొని ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయింది ఆయేషా.
ఇక విడాకుల తర్వాత ఈ మధ్య ఓ అమ్మాయితో తరచూ కనిపిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు ధావన్. గత సంవత్సరం నవంబర్ 4వ తేదీన ముంబై ఎయిర్పోర్ట్ లో శిఖర్ ధావన్ ఓ అమ్మాయితో కలిసి కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ బ్రాండ్ అంబాసిడర్ గా శిఖర్ ధావన్ ఆ మ్యాచ్ ని ఆస్వాదించేందుకు వచ్చాడు. స్టాండ్స్ లో కూర్చున్న శిఖర్ ధావన్ పక్కన మళ్లీ అదే అమ్మాయి కనిపించింది.
Also Read: IPL Trophy SRH: ఈ సారి కప్ SRHదే.. ఇదిగో లెక్కలు ఇవే !
దీంతో మీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ధావన్ ఆ మహిళతో ప్రేమలో పడ్డారని కొందరు కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ఆ మహిళ పేరు సోఫి అని తెలిసింది. శిఖర్ ధావన్ కూడా ఆమెను సోషల్ మీడియాలో ఫాలో చేస్తున్నాడు. ఇక వీరిద్దరూ తాజాగా ఓ పార్టీలో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో శిఖర్ డేటింగ్ లో ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు నేటిజెన్లు. అయితే వీరి డేటింగ్ వార్తలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">