BigTV English

Mrunal Thakur says secrets: లోగుట్టు బయటకు, అందుకే..

Mrunal Thakur says secrets: లోగుట్టు బయటకు,  అందుకే..

Mrunal Thakur says secrets: తక్కువ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. రీసెంట్‌గా రిలీజైన ద ఫ్యామిలీ స్టార్ మూవీతో చాలా మంది అభిమానులకు చేరువైంది.  ఇండస్ట్రీలోకి వచ్చింది దాదాపు దశాబ్దం అయ్యింది. కానీ, అవకాశాలను అందుపుచ్చుకోలేకపోయింది ఈ అమ్మడు. దీనికి కారణమేంటి? కావాలనే గ్లామర్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుందా? ఇలా రకరకాల ప్రశ్నలు అభిమానులను వెంటాడాయి.


మరాఠా సినిమాతో పదేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది మృణాల్ ఠాకూర్. వెండితెర అనగానే రకరకాల షరతులు పెట్టుకుంది. దీంతో మరాఠా ఫిల్మ్స్‌కే పరిమితమైంది. ఫలితం ఆఫర్స్ పెద్దగా రాలేదు. లేకలేక తెలుగులో రెండేళ్ల కిందట ఓ ఆఫర్ వచ్చింది. సీతారామం మూవీతో దక్షిణాదిలో మాంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాతో పర్వాలేదనిపించింది. ద ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ఓ అడుగు ముందు కేసింది. ఇదే జోరు ఈ అమ్మడు కంటిన్యూ చేస్తుందా? అన్నదే అసలు పాయింట్.

రీసెంట్‌గా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాలా విషయాలను బయటపెట్టింది మృణాల్ ఠాకూర్. పదేళ్లగా ఇండస్ట్రీలో ఉంటూ అవకాశాల విషయంలో ఎందుకు వెనుకబడ్డారని ప్రశ్నకు అసలు సీక్రెట్ బయటపెట్టింది. ముద్దు సన్నివేశాల కారణంగా చాలా సినిమాలు వదులుకున్నానని మనసులోని మాట బయటపెట్టింది. కిస్సింగ్ సీన్స్, బెడ్‌రూమ్ సన్నివేశాల్లో తనకు నటించడం ఇష్టముండదని క్లారిటీ ఇచ్చేసింది. ఆ తరహా సన్నివేశాల్లో నటించడం పేరెంట్స్‌కు అస్సలు నచ్చదని తెలిపింది.


అందువల్లే చాలా సినిమాల్లో ఆఫర్లు కోల్పోయానని చెప్పేసింది. ఆ తరహా సన్నివేశాల్లో తనను చూస్తే దగ్గరవాళ్లు ఏమనుకుంటారనన్న భయం తనను అనుక్షణం వెంటాడేదని తెలిపింది. మంచి రోల్స్ సినిమాలను తాను అస్సలు వదులుకోలేదని, అందుకే కొన్ని సినిమాల్లో నటించానని తెలిపింది.

ALSO READ: అందం, అభినయం సామ్ సొంతం, కాకపోతే..

ఈ కారణంగానే గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో భారీ ప్రాజెక్టు వదులుకోవాల్సి వచ్చిందని, కేవలం ఇంటిమేట్ సీన్స్ ఉండడమే దీనికి కారణంగా చెప్పుకొచ్చింది. ద ఫ్యామిలీ స్టార్ మూవీతో కెరీర్ ఊపందుకుంటుందని భావించినప్పటికీ, అది బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది. మరి మంచి సినిమాల కోసం ఈ బ్యూటీ మరిన్ని రోజులు ఆగాల్సిందేనా?

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×