Big Stories

Iran Warning to Israel : ఇజ్రాయెల్ ఎదురుదాడి చేస్తే.. విధ్వంసమే : ఇరాన్ హెచ్చరిక

Iran Warning to Israel : ఆదివారం ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన దాడికి ఇజ్రాయెల్ ప్రతిదాడి చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ ప్రతిదాడి చేస్తే సహకరించేది లేదని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రతిదాడికి పాల్పడితే మధ్యప్రాచ్య సంక్షోభం మరింత తీవ్రతరమవుతుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని బెంజమిన్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు ఇజ్రాయెల్ సైనిక చీఫ్ హెర్జి హవేలి తెలిపారు.

- Advertisement -

ఇరాన్ దాడికి ప్రతిస్పందనగా తిరిగి దాడి చేయడంపై 24 గంటల్లో రెండోసారి మంత్రివర్గంతో సమావేశమైన బెంజమిన్.. ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఒక ఛానల్ చెప్పిన దానిప్రకారం.. ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన డ్రోన్, క్షిపణిదాడికి ప్రతీకారంగా ఎదురుదెబ్బ తీస్తుందని , దీనిపై మంత్రివర్గం తన నిర్ణయాలను చెప్పిందని తెలుస్తోంది. కాగా.. ఇజ్రాయెల్ ప్రతిదాడికి పాల్పడితే.. ఎదుర్కొనేందుకు మునుపెన్నడూ ఉపయోగించని శక్తివంతమైన ఆయుధాలను ఉపయోగిస్తామని ఇరాన్ హెచ్చరించింది.

- Advertisement -

Also Read : ప్రతీకారం తీరిందన్న ఇరాన్.. ప్రతిదాడి చేస్తామన్న ఇజ్రాయెల్.. అమెరికా ఆగ్రహం

ఇజ్రాయెల్ ఈ సమయంలో ప్రతిదాడి చేయకూడదని అమెరికా సహా పలు దేశాలు కోరాయి. అదే జరిగితే చాలా అంతర్జాతీయంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. “మేము ఇరాన్‌తో యుద్ధాన్ని చూడాలనుకోవడం లేదు. మేము ప్రాంతీయ సంఘర్షణను చూడకూడదనుకుంటున్నాము” అని వైట్ హౌస్ జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు.

ఇజ్రాయెల్ పై డ్రోన్ దాడి తర్వాత.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పందించారు. ఇరాన్ కు వ్యతిరేకంగా గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) దేశాలు సమన్వయంతో కూడిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇక ఇరాన్ పై ప్రతిదాడి చేయాలని చూస్తోన్న ఇజ్రాయెల్.. ఇతర దేశాల సలహా మేరకు ఉపసంహరించుకుంటుందో లేదో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News