Big Stories

IPL 2024 RCB vs SRH Highlights: సన్ రైజర్స్ మళ్లీ దంచికొట్టారు.. ఆర్సీబీపై ఘన విజయం

Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad IPL 2024 Highlights: రెండు కొదమ సింహాలు దెబ్బలాడుకుంటే ఎలా ఉంటుందో,  సోమవారం నాటి ఐపీఎల్ మ్యాచ్ అచ్చు అలాగే జరిగింది. బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూసినవాళ్లకి కన్నులపండువగా సాగింది. ధనాధన్ సిక్సర్లతో స్టేడియం హోరెత్తిపోయింది.

- Advertisement -

మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోరు చేసి ఐపీఎల్ చరిత్రలో ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నేనేమీ తక్కువ తినలేదన్నట్టు పోరాడింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసి, ఓడినా శభాష్ అనిపించుకుంది.

- Advertisement -

నిజానికి ఆర్సీబీ మొదట టాస్ గెలిచింది. కానీ బౌలింగ్ తీసుకుని ఎంత పొరపాటు చేసిందనేది వారికి మొదటి బాల్ నుంచి అర్థమైంది. ఈసారి మ్యాచ్ లో ఘోరంగా విఫలమవుతున్న మాక్స్ వెల్, సిరాజ్ ఇద్దరిని పక్కన పెట్టారు. అయినా సరే, పరాజయ పరంపరను ఆపలేకపోయారు.  ఒకవేళ వాళ్లే ఉంటే నిజంగా మ్యాచ్ గెలిచేవారేమోనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మొదట బ్యాటింగ్ కి వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్  ఓపెనర్ ట్రావిస్ హెడ్ (41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102) సెంచరీతో  కదం తొక్కాడు. అతని తర్వాత హెన్రీచ్ క్లాసెన్ (31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 67 ), ఎయిడెన్ మార్క్‌రమ్ (17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) మెరుపులు మెరిపించారు. అందరూ ధనాధన్ ఆడి జట్టు స్కోరుని 287కి చేర్చారు. అలా ముంబయ్ పై ఉప్పల్ లో చేసిన 277 పరుగుల రికార్డ్ ని తామే మళ్లీ తిరగ రాశారు.

Also Read: ఐపీఎల్ వీరుడు రుతురాజ్.. తొలి భారత బ్యాటర్‌గా రికార్డు..

ఆర్సీబీ బౌలింగ్ లో టోప్లీ 1, లుకీ ఫెర్గుసన్ 2 వికెట్లు పడగొట్టారు. కాకపోతే విజయ్ కుమార్, టోప్లీ ఇద్దరూ 4 ఓవర్లలో 60 పైనే పరుగులిచ్చారు. అదే సిరాజ్, మ్యాక్సీ ఉంటే, ఇద్దరూ 40 దగ్గర రన్స్ ఇచ్చేవారని, దాంతో రన్స్ మిగిలి, ఆర్సీబీ మ్యాచ్ గెలిచేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

లక్ష్య ఛేదనలో ఆర్సీబీ కూడా గట్టి ఫైట్ ఇచ్చింది. కానీ త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. విరాట్ 20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ డుప్లెసిస్ 28 బంతుల్లో 7 పోర్లు, 4 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. తర్వాత జాక్స్ (7), పటీదార్ (9), సౌరవ్ చౌహాన్ (0) వరుసగా క్యూ కట్టీశారు. ఈ సమయంలో మ్యాక్సీ ఉంటే మ్యాచ్ ఒక లెవెల్లో ఉండేదని అంటున్నారు.

అయితే తర్వాత వచ్చిన దినేష్ కార్తీక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 35 బంతుల్లో 7 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 83 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అందరిలో ఆశలు చిగురించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అనుజ్ రావత్ (25 నాటౌట్) ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. విజయానికి 25 పరుగుల దూరంలో ఆగిపోయారు. మొత్తానికి 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేశారు.

హైదరాబాద్ బౌలింగ్ లో పాట్ కమిన్స్ 3, నటరాజన్ 1, మయాంక్ 2 వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్ కి వికెట్లు పడలేదు కానీ, 4 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చి భారీగా సమర్పించుకున్నాడు.

మొత్తానికి హైదరాబాద్ ఈ విజయంతో పాయింట్ల టేబుల్ పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. ఆర్సీబీ ఎప్పటిలా 10వ ప్లేస్, అంటే ఆఖరి ప్లేస్ లో అలాగే ఉండిపోయింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News