BigTV English

Sunrisers Hyderabad New Jersey: మారిన సన్ రైజర్స్ జెర్సీ.. రీజన్ ఇదేనా..?

Sunrisers Hyderabad  New Jersey: మారిన సన్ రైజర్స్ జెర్సీ.. రీజన్ ఇదేనా..?

Sunrisers Hyderabad new jersey


Sunrisers Hyderabad New Jersey: సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఆటతో కాకుండా సెంటిమెంట్స్ తో కప్ కొట్టాలని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రతిసారి ఓడిపోవడం, అవమానాల పాలవడం, వారికి షరా మామూలుగా మారిపోయింది. ఇక అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. చివరికి జెర్సీలు మార్చితే పని అవుతుందనే మానసిక స్థితికి వెళ్లిపోయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఐపీఎల్ 2024 సీజన్ లోకి కొత్త జెర్సీతో సరికొత్తగా అడుగు పెట్టనుంది. ఇండియన్  ప్రీమియర్ లీగ్ 2024 ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తమ జెర్సీ ఫొటోను సోషల్ మీడియాలో విడుదల చేసింది.


‘సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్’ జెర్సీనే ఈసారి ఖరారు చేసింది. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ వేదికగా జరిగిన టీ20 లీగ్ రెండో సీజన్ ఫైనల్ పోరులో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై  సన్‌రైజర్స్ ఈస్టర్న్ విజయం సాధించింది. వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో సెంటిమెంటుగా పడి ఉంటుందని ఇండియన్ ఐపీఎల్ లీగ్ లో అక్కడ జెర్సీనే ఉపయోగించనుంది.

Read More: యశస్వి జైశ్వాల్ నయా రికార్డ్.. టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు

గత ఐపీఎల్ లో అట్టడుగున నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి రూ. 20.5 కోట్లతో ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ను కొనుగోలు చేసింది. అంతేకాదు కెప్టెన్ గా కూడా నియమించింది. ఈసారి ఎలాగైనా ఐపీఎల్ కప్ సాధించాలనే పట్టుదలతో ఉంది. అక్కడ గెలిచి ఇక్కడెందుకు ఓడిపోతున్నామనే శంక జట్టు యాజమాన్యాన్ని పట్టి పీడిస్తోంది. అందుకే ఇలా కూడా ప్రయత్నించాలని చూస్తోందని నెటిజన్లు అంటున్నారు.

ఈరోజుల్లో కూడా ఇలాంటివి నమ్ముతారా? అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలతాయా? జెర్సీలు ఏసుకుంటే మ్యాచ్ లు గెలిచేస్తారా? అంటున్నారు.

మార్చి 23న కోల్ కత్తాలో సన్ రైజర్స్ తొలి మ్యాచ్ కోల్ కత్తా నైట్ రైడర్స్ తో ఆడనుంది. మరి ఈ జెర్సీల మాయ పని చేస్తుందా? కమిన్స్ చక్రం తిప్పుతాడా? సన్ రైజర్స్ దశ తిరుగుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఇవన్నీ తెలియాలంటే అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే.

Tags

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×