E-Paper
Advertisement

LIONEL MESSI: క్రైస్తవుడైన మెస్సీతో శివనామ స్మరణం చేయించిన అంబానీ.. ఇదిరా ఇండియా అంటే ?

LIONEL MESSI: క్రైస్తవుడైన మెస్సీతో శివనామ స్మరణం చేయించిన అంబానీ.. ఇదిరా ఇండియా అంటే ?
Advertisement

LIONEL MESSI: గత కొద్ది రోజులుగా గుజరాత్ లోని జామ్ నగర్ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇందుకు గల కారణం ఏంటో కాదు.. ఫుట్ బాల్ ప్రపంచ విజేత, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సి ఈ ప్రాంతంలో అడుగుపెట్టడమే. భారతదేశ పర్యటనలో భాగంగా గుజరాత్ జామ్ నగర్ లోని వంతారా జంతు సంక్షేమ, సంరక్షణ కేంద్రాన్ని సందర్శించాడు మెస్సి. రిలయన్స్ పరిశ్రమల వారసుడు అనంత్ అంబానీ ప్రతిష్టాత్మకంగా ఈ వన్యప్రాణ పునరావాస కేంద్రాన్ని నిర్మించారు. దీనిని తన సహచర ఫుట్బాల్ ప్లేయర్లతో కలిసి సందర్శించాడు మెస్సి.

Also Read: Yashasvi Jaiswal: మ్యాచ్ ఆడుతుండగా కలకలం.. ఆసుపత్రిలో చేరిన జైస్వాల్.. అసలు ఏమైంది అంటే

Advertisement

 

హిందూ సంప్రదాయ పూజల్లో పాల్గొన్న మెస్సి:

మెస్సి ఇండియా పర్యటన ఒక అనూహ్యమైన, హృదయాన్ని తాకే ఘట్టంతో ముగిసింది. అంబాని కుటుంబానికి చెందిన ఆనంత్ అంబానీ స్థాపించిన జామ్ నగర్ వంతారా వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ కన్డర్వేషన్ సెంటర్ ని మెస్సి వ్యక్తిగతంగా సందర్శించిన సమయంలో.. ఆయన హిందూ సంప్రదాయ పూజలలో పాల్గొనడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వైరల్ గా మారిన ఈ వీడియోలో మెస్సి.. ” ఓం నమః శివాయ” అని జపిస్తూ శివలింగానికి పాలు పోసి శివాభిషేకం చేస్తూ కనిపించాడు.

Advertisement

ఈ దృశ్యాలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా దేశం అంతటా గర్వభావాన్ని కలిగించాయి. ఈ వీడియోలో మెస్సి సాదాసీదా దుస్తులు ధరించి, నుదుటిపై తిలకం పెట్టుకుని వంతారాలోని ఆలయంలో ప్రశాంతంగా నిలబడినట్లు కనిపిస్తుంది. అలాగే మహా హారతిలో పాల్గొని శివుడు, గణేషుడు, హనుమంతుడు, అంబే మాత అమ్మవారి పూజా కార్యక్రమాల్లో భాగస్వాముడయ్యాడు. ఇలా మెస్సి పూజలో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో క్షణాలలో వైరల్ గా మారి లక్షలాది వ్యూస్ ని దాటేసింది. ఓ ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం భారతీయ ఆధ్యాత్మిక వాతావరణంలో కనిపించడం అభిమానులలో భావోద్వేగాన్ని రేపింది.

 

రోమన్ క్యాథలిక్ మతాన్ని అనుసరించే కుటుంబంలో జన్మించిన మెస్సి:

అర్జెంటీనాకు చెందిన మెస్సి ఓ క్రైస్తవుడు. ముఖ్యంగా రోమన్ క్యాథలిక్ మతాన్ని అనుసరించే కుటుంబంలో జన్మించి పెరిగాడు. రోజారియో నగరంలో భక్తిశ్రద్ధలు గల కాథలిక్ కుటుంబంలో పెరిగిన మెస్సి.. చిన్ననాటి నుండే మతపరమైన విలువలకు దగ్గరగా ఉండేవాడని అతడి కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెబుతుంటారు. ఆటలో విజయాలు వచ్చిన ప్రతిసారి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మైదానంలో.. ఆకాశం వైపు చూపిస్తూ ప్రార్థించే దృశ్యాలు అభిమానులకు సుపరిచితమే. అంతర్జాతీయ వేదికలపై ఎన్నో ఘన విజయాలు సాధించిన మెస్సి.. తన విశ్వాసాన్ని ఎప్పుడూ ఆడంబరంగా ప్రదర్శించకపోయినప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం దానిని గట్టిగా పాటిస్తాడని సమాచారం.

Also Read: Shree Charani-Lokesh: మహిళా క్రికెటర్ శ్రీచరణికి భారీ సాయం… చెక్ ను అందజేసిన మంత్రి నారా లోకేష్

ముఖ్యంగా కుటుంబంతో కలిసి చర్చికి వెళ్లడం, మతపరమైన సందర్భాలను గౌరవించడం అతడి జీవనశైలిలో భాగం. దేవుడిపై నమ్మకంతో ముందుకు సాగడం మెస్సిని ప్రత్యేకంగా నిలబెడుతున్న అంశాలుగా అభిమానులు భావిస్తున్నారు. ఇక మెస్సి రాకను చిరస్మరణీయం చేస్తూ అనంత్ అంబానీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వంతారాలో పుట్టిన ఒక సింహం పిల్లకు “లియోనల్” అని పేరు పెట్టారు. ఫుట్బాల్ కింగ్ గా పేరు ఉన్న మెస్సి గౌరవార్థం ఈ పేరు పెట్టినట్లు తెలిపారు అనంత్ అంబానీ.

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×