Lionel Messi: అర్జెంటీనా ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఇండియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 13వ తేదీన ఇండియాలో అడుగుపెట్టిన లియోనెల్ మెస్సీ ( Lionel Messi), ప్రధాన నగరాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే మొదట పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా లో ల్యాండ్ అయి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కోల్ కతా నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చారు లియోనెల్ మెస్సీ. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ కూడా ఆడారు. శనివారం రోజున హైదరాబాద్ లోనే బస చేసిన లియోనెల్ మెస్సీ, ఇవాళ ఉదయం ముంబైకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముంబై లో గ్రాండ్ వెల్కమ్ ఆయనకు లభించింది. లేదర్ షో ద్వారా లియోనెల్ మెస్సీకి ఘన స్వాగతం పలికిందిముంబై.
డిసెంబర్ 13వ తేదీన ఉప్పల్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా లియోనెల్ మెస్సీతో పాటు మరో ఇద్దరు ప్లేయర్లు స్టేడియంలో సందడి చేశారు. ఫుట్ బాల్ గురించి ఇండియాలో చాలా మందికి ఎక్కువగా తెలియదు. ఈ నేపథ్యంలోనే మెస్సీతో ఉన్న ఆ ప్లేయర్ల గురించి సెర్చ్ చేస్తున్నారు. అయితే ఉప్పల్ స్టేడియంలో లియోనెల్ మెస్సీతో పాటు ఉన్న ఇద్దరు ప్లేయర్లు కూడా ఫుట్ బాల్ ఆటలో తోపు ఆటగాళ్ళే. అందులో ఒకరు రోడ్రిగో డిపాల్ ( Rodrigo De Paul ). ఇతనిది అర్జెంటీనా. లూయిస్ సువారెజ్ ఇతనిది ఉరుగ్వే దేశం. వీళ్ళిద్దరూ యూఎస్ మేజర్ లీగ్ సాకర్ క్లబ్ ఇంటర్ మయామికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2022 సంవత్సరంలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనా జట్టులో మిడ్ ఫీల్డర్ అయిన రోడ్రిగో డిపాల్, సభ్యుడిగా ఉండటం గమనార్హం. మరో ప్లేయర్ లూయిస్ సువారెజ్ కు ( Luis Suárez ) స్ట్రైకర్ గా మంచి పేరు పొందారు. యూరప్ లీగ్స్ లో రెండు సార్లు గోల్డెన్ బూట్ కూడా గెలుచుకున్నాడు లూయిస్ సువారెజ్.
అర్జెంటీనా ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఇండియాలో పర్యటిస్తున్న నేపథ్యంలో నిన్న సాయంత్ర హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి, స్నేహపూర్వక మ్యాచ్ కూడా ఆడారు అర్జెంటీనా ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ. ఆ తర్వాత ప్రేక్షకులకు అభివాదం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మనువడితో కలిసి మెస్సీ ఫుట్ బాల్ ఆడారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో చిల్ అయి, ముంబై వెళ్లారు.
#WATCH | Mumbai: Bandra-Worli sea link illuminated with the image of Football star Lionel Messi, who is in India for his G.O.A.T India Tour.
Lionel Messi will be in Mumbai tomorrow to greet his fans. pic.twitter.com/PwsqUg6aZ3
— ANI (@ANI) December 13, 2025