Digvesh Rathi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో ( Indian Premier League 2025 Tournament )
భాగంగా… జరుగుతున్న మ్యాచ్ లన్ని చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 20 మ్యాచ్ లు పూర్తిగా ఇవాళ రెండు మ్యాచ్ లు జరిగాయి. మొదట కోల్ కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ ( Kolkata Knight Riders vs Lucknow Super Giants) జట్ల మధ్య… ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఏకంగా నాలుగు పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది లక్నో. 239 పరుగుల లక్ష్యాన్ని.. చేదించే క్రమంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విఫలమైంది. 234 పరుగుల వద్ద.. ఆగిపోయిన కేకేఆర్ ఓటమి చవి చూసింది. అయితే ఈ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన జరిగింది.
ఎన్ని ఫైన్స్ వేసినా నేనింతే..
లక్నో సూపర్ జెంట్స్ యంగ్ బౌలర్ దిగ్వేష్ సింగ్ రతి ( Digvesh Singh Rathi ) మరో వివాదంలో చిక్కుకున్నాడు. వికెట్ తీసిన తర్వాత… నోట్ బుక్… సెలబ్రేషన్స్ చేసే…. దిగ్వేష్ సింగ్ రతి… సరికొత్త సెలబ్రేషన్స్ చేసుకుంటూ కనిపించాడు. కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్.. వికెట్ తీసిన… అనంతరం… చేతి మీద నోట్ బుక్ సెలబ్రేషన్ కాకుండా… నేలపైన.. రాయడం మొదలుపెట్టాడు దిగ్వేష్ సింగ్ రతి. ఇక దిగ్వేష్ సింగ్ రతి సెలెబ్రేషన్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు… దిగ్వేష్ సింగ్ రతి కొత్త సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ల్యాండ్ బుక్ సెలబ్రేషన్ మొదలుపెట్టాడని.. కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మరి కొంతమంది అయితే… దిగ్వేష్ సింగ్ రతి పైన మరోసారి ఫైన్ వేసేందుకు ఐపీఎల్ యాజమాన్యం రంగం సిద్ధం చేసుకుంటుందని… అంటున్నారు. వరుసగా రెండు మ్యాచ్ లో దిగ్వేష్ సింగ్ రతి పైన ఫైన్ వేసిన కూడా… మనోడు అస్సలు మారడం లేదు… సెటైర్లు పేల్చుతున్నారు. ఫైన్ వేస్తారన్న భయం మనోడికి అస్సలు లేదు… అంటూ మరి కొంతమంది దిగ్వేష్ సింగ్ రతి ను మెచ్చుకుంటున్నారు.
నోట్ బుక్ సెలబ్రేషన్స్ పై రెండుసార్లు ఫైన్
దిగ్వేశ్ మొన్న పంజాబ్ కింగ్స్ పైన నోట్ బుక్ సెలబ్రేషన్స్ చేస్తే 1.87 లక్షల ఫైన్ వేశారు. ఇక ముంబై ఇండియన్స్ పైన 3.75 లక్షల ఫైన్ పడింది. ఇవాళ చేసిన పనికి 5 లక్షల పైన పడుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా… ఇవాళ జరిగిన మ్యాచ్ లో లక్నో చివరి క్షణంలో విజయం సాధించింది. 239 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్కతా… 234 పరుగులు చేసి ఓటమిపాలైంది. అయితే కేకేఆర్ ఆటగాళ్లలో కెప్టెన్ రహానే.. ఏకంగా 61 పరుగులు చేశాడు. అలాగే వెంకటేష్ అయ్యర్ 45 పరుగులు చేసి దుమ్ము లేపాడు. అటు రింకు సింగ్ కూడా చివరలో .. రఫ్పాడించాడు. అయినా ఫలితం మాత్రం రాలేదు. లక్నో సూపర్ జెంట్స్ చేతిలో కేకేఆర్ చివరకు ఓడిపోయింది.
Instant impact! 💥👍🏻#DigveshRathi comes into the attack and gets the wicket of his idol, #SunilNarine! 🙌🏻
Watch the LIVE action ➡ https://t.co/RsBcA7HaAO #IPLonJioStar 👉 #KKRvLSG | LIVE NOW on Star Sports 2, Star Sports 2 Hindi & JioHotstar! pic.twitter.com/AkNVKFeQtw
— Star Sports (@StarSportsIndia) April 8, 2025