Digvesh Rathi 5 Wickets : లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్విష్ రాఠీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను బౌలింగ్ చేసి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కి ఆడిన తరవాత ఈ లెగ్ స్పిన్నర్ దిగ్వేష్.. వరుస 5 డెలివరీలలో 5 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. టీ-20 లీగ్ లో ఇతను 5 వికెట్లు తీసినటువంటి వీడియో వైరల్ అవుతోంది. లక్నోసూపర్ జెయింట్స్ కి ఆడినప్పుడు తన నోట్ బుక్ లో రాసుకోవడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఢిల్లీలో జన్మించిన ఈ క్రికెటర్ కూడా ఒత్తిడి ఉన్నటువంటి పరిస్థితుల్లో బంతితో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. 13 మ్యాచ్ ల్లో 30.64 సగటుతో 14 వికెట్లు తీశాడు. అయినప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా రెండో సంవత్సరం కూడా ప్లే ఆప్స్ అవకాశాలను చేజార్చుకుంది.
Also Read : SRH -Kavya Maran: హైదరాబాద్ ఓనర్ కావ్య పాపకు డబ్బులు ఎలా వస్తాయి.. ఇంతలా ఎలా సంపాదిస్తోంది?
ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేస్ రాఠీ 5 బంతుల్లో 5 వికెట్లను తీశాడు. భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మ్యాచ్ ల సమయంలో భావోద్వేగాలు ఉడికిపోతాయని పేర్కొంటూనే.. దిగ్విష్ వివాదస్పద నోట్ బుక్ వేడుకకి మద్దతు పలికాడు. ఆటగాళ్లు రోజు చివరిలో ఒకరితో ఒకరూ స్నేహంగా ఉంటారని తెలిపారు యోగరాజ్ సింగ్. ఇటీవలే ఇన్ సైడ్ స్పోర్టస్ ఇలా మాట్లాడాడు. ” బౌలర్ దిగ్వేష్ కి జరిమానా విధించవద్దు. ఇప్పటికీ బౌలర్ లతో స్నేహంగా ఉన్నారు. అందరూ ఒకేలా ఉండరు. ఎమోషన్స్ ఉంటాయి. వారిని క్షమించండి. సహజంగా రోజు చివరిలో మీరు స్నేహితులు, మీరు క్షమించండి అని చెబితే విషయం ముగిసింది. పెద్ద మనస్సు కలిగి ఉండండి. చిన్న విషయాల్లోకి రాకండి” అని సూచించాడు.
Also Read : Shreyas Iyer : టీమిండియాను ఆదుకునేందుకు రంగంలోకి సర్పంచ్ సాబ్.. ఇక ఇంగ్లాండ్ కు చుక్కలే
ఇటీవల బీసీసీఐ దిగ్వేష్ పై కొరఢా ఝులిపించింది. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తుండటంతో ఏకంగా సస్పెండ్ కూడా చేసింది. అయినప్పటికీ అతను మాత్రం అలాగే వ్యవహరించాడు. ఇటీవల ఐపీఎల్ లో SRH తో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ వైపు చూస్తూ దురుసుగా మాట్లాడాడు. ఐపీఎల్ నిబంధనలు అతిక్రమించినందుకు చర్యలు తీసుకుంటున్నట్టు బీసీసీఐ పేర్కొంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ తో లక్నో తలబడిన సమయంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రియాంష్ ఆర్యను అవుట్ చేసిన తర్వాత అసాధారణంగా ‘లెటర్ రైటింగ్’ చేసినందుకు లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రఠికి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాతో పాటు డీమెరిట్ పాయింట్ విధించింది. మరోవైపు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర, మహమ్మద్ కైఫ్ వ్యాఖ్యాతలు చేస్తున్నప్పుడు దిగ్వేష్ చేష్టలను మెచ్చుకోలేదు.ఐపీఎల్ 2025 సీజన్ లో దిగ్వేష్ అందరితో వివాదాల్లో చిక్కుకోవడం విశేషం. వివాదాలతో గుర్తు పెట్టుకున్న.. ఈ సారి 5 బంతులతో 5 వికెట్లు అందరితో ఆశ్చర్యపరిచాడు.
?igsh=MXY2eG50enhvNm15bQ==