Visakhapatnam Railway Station: విశాఖ రైల్వే స్టేషన్‌కు వెళుతున్నారా? అయితే ఈ సమాచారం తప్పక తెలుసుకోండి. ప్రయాణానికి సర్దుకుని స్టేషన్‌కు చేరుకున్నప్పుడు, గతంలో ఎప్పుడు వెళ్లినవిధంగా అనుకుంటే.. ఈసారి కాస్త తేడా ఉంటుందేమో! ఎందుకంటే ప్లాట్‌ఫారమ్‌లకు వెళ్లే మార్గాల్లో కొన్ని తాత్కాలిక మార్పులు చేశారట. మీ ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లే దారిలో చిన్న మార్పులు ఉండొచ్చన్న మాట. ప్రయాణం చివరి నిమిషంలో గందరగోళంగా మారకముందే, ఈ మార్పుల వివరాలు తెలుసుకుని ప్లాన్ చేసుకుంటే మంచిది. లేకుంటే ఇబ్బందులు తప్పవు.
విశాఖ స్టేషన్‌లో మారిన మార్గాలు..
విశాఖపట్నం రైల్వే స్టేషన్ రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటి. అలాంటిది ఇపుడు అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, కొన్ని మార్గాలు తాత్కాలికంగా మార్చినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ముఖ్యంగా, గేట్ నంబర్ 3 దగ్గర ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FOB) పనుల కారణంగా, అది ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్ నంబర్ 2, 3 కే పరిమితమైంది. మిగతా ప్లాట్‌ఫారమ్‌లకు వెళ్లాలంటే.. స్టేషన్‌లో ఉన్న ఇతర రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లు, అలాగే లిఫ్ట్‌లను వాడాల్సి ఉంటుంది.
ముందస్తు ప్లాన్ చేసుకోండి
ఈ మార్పులు జూన్ 16 నుంచి అమలులోకి వచ్చాయి. ప్రయాణికులు ముందుగానే ప్లాన్ చేసుకుని, మారిన మార్గాలు అనుసరిస్తే ప్రయాణం సజావుగా సాగుతుంది. ముఖ్యంగా పెద్దవాళ్లు, చిన్న పిల్లలతో ఉన్నవాళ్లు, లగేజీ ఎక్కువగా ఉన్నవారు.. అధికారుల సూచనల ప్రకారం ముందస్తుగా FOB మార్గాలు చూసుకోవాలి.
Also Read: National Highway: హైదరాబాద్ నుంచి విశాఖకు ఫాస్ట్ ట్రాక్.. ఇక గంటల జర్నీ మరచిపోండి!
ఈ పనులు ఎందుకు?
ఇది విశాఖ స్టేషన్‌ను మరింత అభివృద్ధి చేయడానికే. పాత FOB పొడిగింపు, కొత్త వంతెనల నిర్మాణం ఇలా అన్నీ ప్రారంభమయ్యాయి. వాటి పనుల్లో భాగంగా గేట్ 3 FOBను తాత్కాలికంగా మూసేశారు. స్టేషన్‌లోని ఇతర మార్గాలు పూర్తిగా పని చేస్తున్నాయి.
అధికారుల సమీక్ష..
డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా, సీనియర్ అధికారులతో కలిసి నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులు అసౌకర్యానికి లోనుకాకుండా చూసేందుకు సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సీనియర్ కమర్షియల్ మేనేజర్ కె. సాన్దీప్ మాట్లాడుతూ.. ఇది ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం చేస్తున్న పని. కొద్దిరోజులు సహనం అవసరం అన్నారు.
ఇప్పుడు చేయాల్సింది?
స్టేషన్‌కు వెళ్లే ముందు.. ఏ ప్లాట్‌ఫారమ్‌కు ఏ FOB ద్వారా వెళ్లాలో తెలుసుకోవాలి. లిఫ్ట్‌లు అందుబాటులో ఉంటాయి. ఆత్మవిశ్వాసంగా అడిగి తెలుసుకుని, సిబ్బందిని సంప్రదించి మీ ప్రయాణం సాగించండి. చివరగా చెప్పుకోవాల్సింది ఒక్కటే.. ఈ అసౌకర్యం తాత్కాలికం. కానీ, రేపటి ప్రయాణం మరింత సౌకర్యంగా ఉండాలంటే ఇవి అవసరమని రైల్వే అంటోంది. అయితే విశాఖ రైల్వే స్టేషన్ కు వచ్చే వారు, తప్పక ఈ సమాచారం తెలుసుకోండి సుమా!