Shreyas Iyer : ఐపీఎల్ 2025 తరువాత శ్రేయాస్ అయ్యర్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ కి తీసుకెళ్లాడు సర్పంచ్ సాబ్. దీంతో సర్పంచ్ సాబ్ కి యావత్ క్రికెట్ ప్రపంచం సలాం కొట్టింది. అటు కెప్టెన్సీ.. ఇటు బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2025లో 604 పరుగులు చేశాడు. అందులో 6 హాఫ్ సెంచరీలతో పాటు క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ చేసిన 87 పరుగులు హైలెట్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఒంటి చేతితో పంజాబ్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వైపు ఇప్పుడు బీసీసీఐ చూస్తోంది. బీసీసీఐలోని ఓ కీలక వ్యక్తి ఇచ్చిన లీడ్ ఆధారంగా ఆటగాడి వైపు నుంచి ఒక మంచి కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ ఎదిగిన తీరును బీసీసీఐ చూస్తుందట. ప్రస్తుతం కేవలం వన్డే మ్యాచ్ లే ఆడుతున్న శ్రేయస్ ను అతి కొద్ది కాలంలోనే టీ-20, టెస్ట్ మ్యాచ్ ల్లో తీసుకునే ఆలోచనలో బీసీసీఐ పడింది.
Also Read : Zaheer Khan spin : జహీర్ ఖాన్ స్పిన్ బౌలింగ్ చేస్తాడా.. ఇదిగో వీడియో
ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ప్రెసిడెంట్ శ్రేయాస్ అయ్యర్ కి కాల్ చేసినట్టు సమాచారం. త్వరలోనే శ్రేయాస్ అయ్యర్ ఇంగ్లండ్ కి వెళ్లనున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఇందులో వాస్తవమో లేదో తెలియదు. కానీ వీడియో మాత్రం వైరల్ అవుతోంది. వాస్తవానికి శ్రేయాస్ అయ్యర్ మాత్రం ఇంగ్లాండ్ టూర్ కి వెళ్లడం లేదు. ఇది ఫేక్ వీడియో అని తెలుస్తోంది. కానీ ఇంగ్లాండ్ వెళ్తున్నట్టు వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో శ్రేయాస్ అయ్యర్ ని ట్రోలింగ్స్ చేయడం విశేషం. మరోవైపు టెస్ట్ కెప్టెన్ గా శుబ్ మన్ గిల్ ఇటీవలే నియమితులైన విషయం విధితమే. మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ-20, టెస్ట్ క్రికెట్ కి గుడ్ చెప్పాడు. ఇక త్వరలోనే వన్డేలకు సైతం వీడ్కోలు పలికే ఛాన్స్ కనిపిస్తోంది. ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటించకపోయినా కెప్టెన్సీ నుంచి మాత్రం తప్పుకునే అవకాశం అయితే లేకపోలేదు.
కెప్టెన్ గా అయ్యర్..
ఈ నేపథ్యంలోనే శ్రేయాస్ అయ్యర్ కి వన్డే పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ పెద్దలు ఆలోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ లో శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడం.. గతంలో తన కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ ని ఫైనల్ కి తీసుకురావడం.. 2024లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లోనే కేకేఆర్ కి టైటిల్ అందించడం.. 2025 ఐపీఎల్ లో రన్నరప్ గా నిలిచింది పంజాబ్ కింగ్స్. ఇక ఇవన్నీ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా అయ్యేందుకు శుభ సూచకాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయ్యర్ మనస్సులో మాత్రం ఏముందో తెలియదు. కానీ శ్రేయస్ అయ్యర్ పై మాత్రం సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించడం విశేషం.
🚨🚨OFFICIAL: BCCI has recalled Shreyas Iyer to join the Indian squad in England.
The decision comes ahead of the upcoming Test series, signaling a renewed backing for the middle-order batter after his recent setbacks.
— Virat (@chiku_187) June 16, 2025