LSG VS MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే ఈ మెగా టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా శుక్రవారం కీలక మ్యాచ్ జరిగింది. లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Mumbai Indians vs Lucknow Super Giants ) మధ్య 16వ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో అనూహ్యంగా… చివర్లో ముంబై ఇండియన్స్ పైన లక్నో సూపర్ జెంట్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా 12 పరుగుల తేడాతో… ముంబై ఇండియన్స్ పైన లక్నో సూపర్ జెంట్స్ విజయం సాధించింది. దీంతో ఈ టోర్నమెంట్లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది లక్నో సూపర్ జెంట్స్.
Also Read : Venkatesh Iyer: 300 లేదు బొక్క లేదు… SRH పరువు తీసిన వెంకటేష్ అయ్యర్ ?
ఇవాల్టి మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్… లక్నోకు భారీ పరుగులే ఇచ్చింది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 203 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే… క్రమంలో దారుణంగా విఫలమైంది ముంబై ఇండియన్స్. 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి కేవలం 191 పరుగులు మాత్రమే చేసింది ముంబై ఇండియన్స్. ఈ దెబ్బకు లక్నో సూపర్ జెంట్స్ చేతిలో 12 పరుగుల తేడాతో ఓడిపోయింది ముంబై ఇండియన్స్.
తేలిపోయిన ముంబై బ్యాటర్లు
లక్నో సూపర్ జట్టు పైన ముంబై ఇండియన్స్ బ్యాటర్లు తేలిపోయారు. ఈ మ్యాచ్లో విల్ జాక్స్ ఐదు పరుగులు చేయగా రెకెల్టన్ పది పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నమన్ 24 బంతుల్లో 46 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో మూడు సిక్సర్లతో పాటు నాలుగు బౌండరీలు ఉన్నాయి. అయితే దిగ్వేష్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు నమన్. అటు సూర్య కుమార్ యాదవ్ 43 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సర్ తో పాటు తొమ్మిది బౌండరీలు ఉన్నాయి. తిలక్ వర్మ 23 బంతుల్లో 25 పరుగులు చేసి రిటైర్ అయ్యాడు. ఇక్కడే ముంబై ఇండియన్స్ కొంప మునిగింది. మంచి పికప్ లో ఉన్న తిలక్ వర్మ పెవీలియన్ కు వెళ్లడంతో.. ముంబై ఓడిపోయిందని చెప్పవచ్చు. హార్దిక్ పాండ్యా 28 పరుగులు చేయగా… శాంట్నర్ పరుగులు చేశాడు. అప్పటికే బందులు పూర్తి కావడంతో మ్యాచ్ ఓడిపోయింది ముంబై ఇండియన్స్.
Also Read : Rohit Sharma: వివాదంలో రోహిత్ శర్మ… ముంబైని నిండా ముంచేలా ఉన్నాడే..?
పాయింట్స్ టేబుల్ లో దిగజారిన ముంబై ఇండియన్స్
లక్నో చేతిలో ఓడిపోవడంతో… పాయింట్ల పట్టికలో ఏడవ స్థానానికి చేరుకుంది ముంబై ఇండియన్స్. అటు నాలుగు మ్యాచ్లలో రెండు మ్యాచ్లు గెలిచిన లక్నో సూపర్ జెంట్స్ ( LSG ) ఆరవ స్థానానికి చేరుకుంది. పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానంలో పంజాబ్ టీమ్స్ ఉండగా చివరి స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ ( Sun risers Hyderabad ) జట్టు ఉంది.