Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 నేడు మరో ఆసక్తికర సమరం జరగబోతోంది. లక్నోలోని ఏకనా స్టేడియంలో ముంబై ఇండియన్స్ – లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడబోతున్నాయి. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఆశించినంత మేర రాణించలేకపోయాయి. దీంతో పాయింట్ల పట్టికలో టాప్-4 లో చోటు దక్కించుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో నేడు జరిగే మ్యాచ్ లో గెలిచి సత్తా చాటాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి.
ఈ క్రమంలో లక్నోలోని ఏకనా స్టేడియంలో ఇరుజట్ల ఆటగాళ్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. ఐతే ప్రాక్టీస్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ జహీర్ ఖాన్ – ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒకరికి ఒకరు తారసపడ్డారు. ఈ క్రమంలో వారు కాసేపు ముచ్చటించారు. అయితే జహీర్ ఖాన్ తో రోహిత్ శర్మ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. జహీర్ ఖాన్ తో రోహిత్ శర్మ పర్సనల్ విషయాలు మాట్లాడుకున్న వీడియో బయటకి వచ్చింది.
ఆ వీడియోని ముంబై ఇండియన్స్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. నిజానికి ఆ వీడియోలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్.. రోహిత్ శర్మని వెనక నుండి వెళ్లి హగ్ చేసుకోవడం వాళ్ల బాండింగ్ ని చూపించే విధంగా ఉన్నప్పటికీ.. అక్కడికి పంత్ రాకముందే రోహిత్ శర్మ జహీర్ ఖాన్ తో చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాడు. రోహిత్ శర్మ ఏమన్నారంటే.. “జో జబ్ కర్ణా థా మైనే కియా బరాబర్ సే, అబ్ మేరెకో కుచ్ కర్నే కి జరూరత్ నహీ హై” అని అన్నాడు.
అంటే.. చెయ్యాల్సిన సమయంలో నేను అన్నీ చేశాను.. ఇప్పుడు నేను ఏం చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు. ఆ తర్వాత వెంటనే వెనుక నుండి రిషబ్ పంత్ ఒక్కసారిగా వచ్చి అతడిని గట్టిగా హగ్ చేసుకున్నాడు. అయితే ముంబై కెప్టెన్సీ, జట్టు ప్రదర్శనను ఉద్దేశించే రోహిత్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజెన్స్ అంటున్నారు. కెప్టెన్సీ బాధ్యతలు లేవు కాబట్టి ఇక తనకు సంబంధం లేదని.. బ్యాటింగ్ ఒకటే తన పని అనేలా రోహిత్ శర్మ వ్యాఖ్యలు ఉన్నాయని చెబుతున్నారు.
గత సంవత్సరం ఐపిఎల్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించి.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యా ని నియమించింది ముంబై మేనేజ్మెంట్. ఆ సమయంలో రోహిత్ శర్మ చాలా హర్ట్ అయినట్టు వార్తలు వినిపించాయి. ఇక రోహిత్ శర్మ ముంబై నుండి బయటకు వచ్చేస్తాడని కూడా పుకార్లు షికార్లు చేశాయి. కానీ అలా జరగలేదు. ఈ క్రమంలోనే ముంబై మేనేజ్మెంట్ విషయంలో రోహిత్ శర్మ కి ఇంకా కోపం తగ్గలేదని, కెప్టెన్సీ నుండి తనను తీసేసిన తీరుపై అతడు ఇంకా ఆగ్రహంతోనే ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
గత ఐపీఎల్ సమయంలో అప్పటి కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తో రోహిత్ శర్మ మాట్లాడిన వీడియో కూడా వైరల్ గా మారింది. ఇదే తనకి చివరిది అని రోహిత్ శర్మ అనడంతో.. ఇక ముంబై తో తెగదెంపులు చేసుకొని కొత్త ఫ్రాంచైజీ లోకి అడుగుపెడతాడని అంతా భావించారు. కానీ ముంబైలోనే కంటిన్యూ అవుతున్నాడు రోహిత్ శర్మ. అయితే ఈ సీజన్ లో ముంబై ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్లలో.. కేవలం ఒక మ్యాచ్లో మాత్రమే గెలుపొందింది. ఇలా ముంబై డౌన్ ఫాల్ లోకి వెళుతున్న సమయంలో.. నువ్వెందుకు ఏం చేయడం లేదని జహీర్ ఖాన్ ప్రశ్నించడంతోనే రోహిత్ శర్మ ఇలా రియాక్ట్ అయి ఉంటాడని అంతా అనుకుంటున్నారు.
Q: For how long are you going to watch this reel? 😍
A: Haaanjiiii 🫂💙#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #LSGvMI pic.twitter.com/e2oxVieoz2
— Mumbai Indians (@mipaltan) April 3, 2025