SRH VS LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో ( Indian Premier League 2025 Tournament )… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దారుణ ఓటమి ఎదురైంది. మొదటి మ్యాచ్లో అద్భుతంగా రాణించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు… లక్నో సూపర్ జెంట్స్ చుక్కలు చూపించింది. సొంత గడ్డ ఉప్పల్ లోనే…. హైదరాబాద్ ప్లేయర్లకు నరకం చూపించారు లక్నో ప్లేయర్లు. ఇవాళ జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ( Sunrisers Hyderabad ) ఏకంగా ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది లక్నో సూపర్ జెంట్స్ ( Lucknow Super Giants ). బౌలింగ్ అలాగే బ్యాటింగ్ లో అదరగొట్టిన లక్నో సూపర్ జెంట్స్…. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. 191 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి మాత్రమే ఛేదించింది లక్నో సూపర్ జెంట్స్. 16.1 ఓవర్లలో… ఐదు వికెట్లు నష్టపోయిన లక్నో సూపర్ జెంట్స్… లక్ష్యాన్ని చేదించి గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో ఈ టోర్నమెంట్లో మొదటి పరాజయాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎదుర్కొంది.
Also Read: Riyan Parag Fan: డబ్బులు ఇచ్చి, ఇలాంటి పనులు ఏంటీ పరాగ్ ?
నికోలస్ పూరన్, మార్ష్ భయంకరమైన బ్యాటింగ్
హైదరాబాద్ జట్టుపై నికోలస్ పూరన్( Nicholas Pooran) అలాగే మిచెల్ మార్ష్ ( Mitchell Marsh) ఇద్దరు భయంకరంగా బ్యాటింగ్ చేశారు. మిచెల్ మార్స్ 31 బంతుల 52 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు అలాగే ఏడు బౌండరీలు ఉన్నాయి. ముఖ్యంగా నికోలస్ పూరన్( Nicholas Pooran) 26 బంతుల్లో 70 పరుగులు చేసి సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే నికోలస్ పూరన్ ( Nicholas Pooran) బ్యాటింగ్ లో… ఆరు సిక్సర్లు అలాగే ఆరు బౌండరీలు ఉన్నాయి.
ఇక అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు…. భారీ స్కోర్ చేయడంలో విఫలమైంది. ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి ప్లేయర్లు భారీగా ఆడే ప్రయత్నం చేశారు. వాళ్లు ఆడినప్పటికీ మిగతా ప్లేయర్లు పెద్దగా రాణించలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 190 పరుగులకే ఆల్ అవుట్ అయింది. మిడిల్ ఆర్డర్లో… సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ అలాగే అంకిత వర్మ ఇద్దరు రాణించడంతో ఆమాత్రం స్కోర్ చేయగలిగింది హైదరాబాద్.
Also Read: SRH VS LSG: బ్యాటింగ్ చేయనున్న SRH… ఇక కాటేరమ్మ కొడుకులు 300 కొట్టడం పక్కా!
డీలా పడిపోయిన హైదరాబాద్ ఓనర్ కావ్య పాప
హైదరాబాద్ మ్యాచ్ అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది కావ్య పాప. అయితే మొదటి మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీ కొట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును… బాగా ఆస్వాదించిన కావ్య పాప ఇవాల్టి రోజున… చాలా డీలా పడిపోయారు. హైదరాబాద్ బ్యాటర్లందరూ వరుస పెట్టి అవుట్ అవుతున్న నేపథ్యంలో… ఆమె షాకింగ్ రియాక్షన్స్ ఇస్తూ వైరల్ గా మారారు. అదే సమయంలో పూరన్ బ్యాటింగ్ చూసి… ఆమె బిత్తర పోవాల్సి వచ్చింది.