SRH VS LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఇవాళ ఏడవ మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు 6 మ్యాచులు చాలా విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా… సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటికి క్రితమే ముగిసింది. అయితే ఇందులో టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. మొదట బ్యాటింగ్ చేయబోతుంది. సన్రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలో.. క్రికెట్ అభిమానులు అందరూ సంబరపడిపోతున్నారు. ఇవాళ హైదరాబాద్ మళ్లీ భయంకరమైన బ్యాటింగ్ చేయబోతుందని అంచనా వేస్తున్నారు.
Also Read: Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ కు బంపర్ ఆఫర్… బీసీసీఐ కీలక ప్రకటన!
మ్యాచ్ టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి ?
సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ మనం జియో హాట్ స్టార్ లో ఉచితంగానే చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ప్రసారాలు అవుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన అన్ని మ్యాచ్లు కూడా… జియో హాట్ స్టార్ లో ఉచితంగానే అందిస్తున్నారు.
హైదరాబాద్ పై లక్నో రికార్డులు?
సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య రికార్డులు ఒకసారి పరిశీలిస్తే… ఈ రెండు దట్ల మధ్య నాలుగు మ్యాచ్లు ఇప్పటివరకు జరిగాయి. ఇందులో సన్రైజర్స్ ఒకే ఒక మ్యాచ్ లో విజయం సాధించింది. అదే లక్నో మాత్రం మూడు మ్యాచ్లో విజయం సాధించడం జరిగింది. అంటే ఈ మ్యాచ్ లో లక్నో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రస్తుత హైదరాబాద్ జట్టును పరిశీలిస్తే… వాళ్లను తట్టుకోవడం లక్నో వల్ల అస్సలు కాదు. హైదరాబాద్ టాపార్డర్ మొత్తం 200 స్ట్రైక్ రేట్ తో దుమ్ము లేపుతున్నారు.
భయంకరంగా హైదరాబాద్ బ్యాటింగ్
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చూస్తే అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. హెడ్, అభిషేక్ శర్మ, కొత్తగా ఇషాన్ కిషన్, క్లాసెన్ అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేస్తున్నారు. వీళ్లు క్లిక్ అయితే 300 కొట్టడం పక్కా. ఇవాళ మొదట బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ కచ్చితంగా 300 స్కోర్ కొడుతుందని అందరూ అంచనా వేస్తున్నారు.
Also Read: HCA – IPL Tickets: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. వాళ్లకు ఐపీఎల్ టికెట్లు !
హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల వివరాలు
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్‌రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), డేవిడ్ మిల్లర్, ఆయుష్ బడోని, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠీ, ప్రిన్స్ యాదవ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(w), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(c), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ