BigTV English
Advertisement

GT Vs LG : భారీ స్కోర్ చేసిన గుజరాత్.. లక్నో టార్గెట్ ఎంతంటే..?

GT Vs LG : భారీ స్కోర్ చేసిన గుజరాత్.. లక్నో టార్గెట్ ఎంతంటే..?

GT Vs LG : ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ 26 వ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ లక్నో సూపర్ జాయింట్స్ మధ్య హోరా హోరీగా జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టాస్ ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. రెండు జట్లు హోరా హోరీగా పోరాడుతున్నాయి. పాయింట్ల టేబుల్స్ ని పరిశీలించినట్టయితే గుజరాత్ టైటాన్స్ తొలి స్థానంలో కొనసాగుతోంది. లక్నో జట్టు మాత్రం 5 మ్యాచ్ లు ఆడి 3 మ్యాచ్ ల్లో విజయం సాధించి 2 మ్యాచ్ లలో ఓడిపోయింది.


ఈ మ్యాచ్ లో గుజరాత్ బ్యాటర్లు సాయి సుదర్శన్ 56, శుబ్ మన్ గిల్ 60, జాస్ బట్లర్ 16, వాషింగ్టన్ సుందర్ 02, రూథర్ ఫోర్డ్ 22, షారూఖ్ ఖాన్ 11, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ 4 పరుగులు చేశారు. ఇక లక్నో బౌలర్లను పరిశీలించినట్టయితే.. శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. దిగ్వేష్ సింగ్ రతి 1, అవేష్ ఖాన్ 1, రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీశారు. గుజరాత్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.  దీంతో లక్నో సూపర్ జెయింట్స్ టార్గెట్ 181 పరుగులు.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. ఆ జట్టు విజయాల్లో ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ పాత్ర చాలా కీలకం. ఈ ఇద్దరు దాదాపుగా ప్రతి మ్యాచ్లో నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తూ జట్టు విజయానికి పటిష్టమైన పునాది వేస్తున్నారు. ఈ సీజన్ లో సాయి ఆడిన ఆరు మ్యాచ్ నాలుగు హాఫ్ సెంచరీలు చేసి లీడింగ్ రన్ స్కోరర్ గా కొనసాగుతుండగా.. గిల్ చివరి మూడు మ్యాచ్ రెండు హాఫ్ సెంచరీలు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.  వాస్తవానికి ఓపెనర్లు గుజరాత్ కి అదిరిపోయే శుభారంభం అందించారు. క్రీజులో పాతుకుపోయిన గిల్, సుదర్శన్ రిస్కీ షాట్ల జోలికి వెళ్లకుండా నిలకడగా బౌండరీలు బాదారు. 8 ఓవర్ల కు ప్రతీ ఓవర్ లో కనీసం ఒక్క బౌండరీ గ్యారెంటీగా రాబట్టారు. గిల్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దిగ్వేష్ సింగ్ రాఠీ బౌలింగ్ లో 46 పరుగుల వద్ద సుదర్శన్ ఇచ్చిన క్యాచ్ ను అబ్దుల్ సమద్ డ్రాప్ చేశాడు. అదే ఓవర్ లో చివరి బంతికి పోర్ కొట్టి సుదర్శన్ హాఫ్ సెంచరీ చేశాడు. 12 ఓవర్లకు 120 పరుగులు చేయగా.. గుజరాత్ సులభంగా 200 పరుగులు చేసేలా కనిపించింది. కానీ బౌలర్లు పుంజుకోవడంతో భారీ స్కోర్ చేయలేకపోయాడు.


 

లక్నో సూపర్ జెయింట్స్ :

ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), హిమ్మత్ సింగ్, డేవిడ్ మిల్లర్,
అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.

గుజరాత్ టైటాన్స్:

సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షెర్పానే రూథర్ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్

 

Tags

Related News

Hong Kong Sixes 2025: మ‌రోసారి ప‌రువు తీసుకున్న పాకిస్తాన్‌…బ‌ట్ట‌ర్‌ ఇంగ్లీష్ రాక ఇజ్జ‌త్ తీసుకున్నారు

Kranti Gaud: 2012 జాబ్ పీకేశారు, కానీ లేడీ బుమ్రా దెబ్బ‌కు తండ్రికి పోలీస్ ఉద్యోగం..ఇది క‌దా స‌క్సెస్ అంటే

MS Dhoni: ధోని ఒకే ఒక్క ఆటోగ్రాఫ్‌..రూ.3 ల‌క్ష‌లు కాస్త, రూ.30 కోట్లు ?

RCB For Sale: RCB పేరు మార్పు, ఇక‌పై ZCB…బెంగ‌ళూరు జ‌ట్టుకు కొత్త ఓన‌ర్ ఎవ‌రంటే ?

IND VS SA: ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, షెడ్యూల్‌, బ‌లాబ‌లాలు ఇవే..ఉచితంగా ఎలా చూడాలంటే

Hong Kong Sixes 2025 : హార్దిక్ పాండ్యాను కాపీ కొట్టిన పాకిస్తాన్..ఛీ.. ఛీ ఎంతకు తెగించార్రా

IPL 2026: SRH జ‌ట్టులో ఫిక్సింగ్..అంబానీతో చేతులు క‌లిపి ద‌గా, కావ్యపాప స్కెచ్ చూడండి !

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్‌, వేదిక‌లు ఇవే…హైద‌రాబాద్, విశాఖ‌కు అన్యాయం ?

Big Stories

×