Janhvi Kapoor:ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అక్కడ వరుస సినిమాలు చేసి అలరించిన ఈమె ఇప్పుడు సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన ఈమె ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఇక మరొకవైపు తెలుగుతో పాటు హిందీలో కూడా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇక ఇలాంటి సమయంలో తాజాగా ఈమెకు బిర్లా వారసురాలు అనన్య బిర్లా (Ananya Birla) ఊహించని కానుక పంపించి వార్తల్లో నిలిచారు.
జాన్వీ కపూర్ కి అదిరిపోయే గిఫ్ట్ పంపిన అనన్య బిర్లా..
ఈ మేరకు రూ.5కోట్ల విలువ చేసే లంబోర్గిని కారును జాన్వీకి కానుకగా పంపించింది బిర్లా వారసురాలు అనన్య. ఈ మేరకు శుక్రవారం ఉదయం పర్పుల్ కలర్ లంబోర్గినీ కారును జాన్వి నివాసానికి పంపించారు. ఆ కారుతో పాటు మరో గిఫ్ట్ కూడా అందులో ఉంచారు. దానిపై..” ప్రేమతో నీ అనన్య..” అని కూడా రాసి ఉంది. మొత్తానికైతే జాన్వీ కపూర్ నివాసానికి లంబోర్ఘిని కారు వెళుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏదేమైనా ఇలాంటి గొప్ప ఫ్రెండ్ ఉండడం నిజంగా అదృష్టం అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
అనన్య కొత్త సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా జాన్వీ..
ఇక అనన్య బిర్లా విషయానికి వస్తే.. ఈమె ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం కుమార్తె. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ బోర్డ్ డైరెక్టర్లలో అనన్య ఒకరు. 17 ఏళ్ల వయసులోనే స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తన మొదటి సంస్థను స్థాపించిన ఈమె భారత్ లోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో ఒకటిగా ఇది నిలిచింది. వ్యాపారవేత్తగానే కాకుండా ఇవి మంచి గాయని కూడా.. పలు ప్రైవేట్ ఆల్బమ్స్ కోసం కూడా పనిచేశారు. ఇక అనన్య.. జాన్వీ మంచి స్నేహితులు. త్వరలోనే అనన్య స్టార్ట్ చేయబోయే కాస్మెటిక్స్ వ్యాపారానికి జాన్వీ బ్రాండ్ అంబాసిడర్ కూడా..ఈ నేపథ్యంలోనే జాన్వీ కోసం ఇలాంటి బ్యూటిఫుల్ గిఫ్ట్ పంపించి ఉంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Vishwambhara: విశ్వంభర లిరికల్ సాంగ్ లో ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా..?