IND Vs PAK : ఆసియా కప్ 2025 ప్రస్తుతం సూపర్ 4 మ్యాచ్ లు జరుగుతున్నాయి. మొన్న పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి చెందింది. ఈ నేపథ్యంలో పలువురు పాకిస్తానీయులు టీమిండియా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మాధవీలత కీలక వ్యాఖ్యలు చేశారు. ” నేను క్రికెట్ అభిమానిని కాదు. నేను క్రికెట్ చూడను. కానీ ఎప్పుడైనా ఒకసారి వరల్డ్ కప్ మ్యాచ్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లను మాత్రమే చూస్తాను. మొన్న ఆడిన మ్యాచ్ ను చూసిన అని తెలిపింది. అయితే ఆ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ఏదో మ్యాచ్ అయినట్టు బుస్ బుస్ అంటూ కథలు కథలు చేశారు.
Also Read : IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!
“అస్సలు రఫెల్స్ కూల్చింది పాకిస్తాన్ వాళ్లు తప్ప ఇంకెవ్వరూ చూడలేదు. పాకిస్తాన్ డిఫెన్స్ ఎక్కడ చూశారు. మన ఇండియన్ సోషల్ మీడియాలో రఫెల్స్ కూల్చినట్టు చూడటం విశేషం. పాకిస్తాన్ వాళ్లు రపెల్స్ కూల్చడం అయితే అస్సలు చూడలేదు. మేము రఫెల్స్ కూల్చలేదు. పుల్వామా ఎటాక్ మా ప్లానే అని చెప్పేసి ఎయిర్ ఫోర్స్ హెడ్, ఆర్మీ హెడ్ చెప్పాడు. అయినా సరే సిగ్గు, శరం, లేకుండా పుసుకు పుసుకు అంటే.. మన సోషల్ మీడియా వాళ్లు ఏమైనా ఊరుకుంటారా..? కరెక్టే మేము 11 ఎయిర్ బేస్ విమానాలను కూల్చినం. మా బ్రహ్మోస్ లు పెట్టి ఉగ్రవాదుల స్థావరాలను లేపినం. సింధూ జలాలను ఆపినం. ఆకాశంలోకి మిస్సైల్స్ పంపితే.. సుదర్శన చక్రం టుస్క్ అనేసింది. ఇలా ఇవన్నీ ప్రపంచానికి కనిపించిన సాక్ష్యాలు. పాకిస్తాన్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయండిరా గ్రౌండ్ లో అంటే.. ఇండియా పై ఎలా తూటాలు పేల్చాలి. ఎలా వ్యవహరించాలి అనేలా చేశారు. పాకిస్తాన్ లవర్స్ చాలా మంది ఉంటారు. వాళ్లు కూడా ఇండియా మీద పడి ఏడవడం తప్ప ఏం పీకలేరు” అంటూ సెన్షేషన్ కామెంట్స్ చేశారు నటి మాధవీ లత. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వాస్తవానికి సూపర్ 4లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఆటగాళ్లు కాస్త వివాదాలు తలెత్తేలా వ్యవహరించారు. ముఖ్యంగా తొలుత ఫకర్ జమాన్ ఔట్ వివాదం, పాక్ ఓపెనర్ ఫర్హాన్ పహల్గామ్ దాడుల బాధితులను అవమానపరచడం.. అంటే హాఫ్ సెంచరీ చేయగానే గన్ పెట్టి కాల్చినట్టు ఫొటోకి పోజులు ఇవ్వడం వంటివి చేశాడు. పాక్ బౌలర్ హారిస్ రవూఫ్ ‘ఆపరేషన్ సింధూర్’ లో భారత్ 6 ఫైటర్ జెట్లను కోల్పోయిందని వేళ్లతో సంజ్ఞలు చేయడం.. అందుకు టీమిండియా ఫ్యాన్స్ కోహ్లీ.. కోహ్లీ అంటూ సమాధానం చెప్పారు. దీంతో మనోడు చేసేది ఏమి లేక టీమిండియా ఫ్యాన్స్ అరుపులకు చెవులు మూసుకున్నాడు. ఇండియాతో పెట్టుకుంటే అట్టుంటది అని సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చారు ఫ్యాన్స్.
?igsh=bGs4a2xsNGV6d3dh