E-Paper
Advertisement

T20:బాల్‌తో పరుగో పరుగు…

T20:బాల్‌తో పరుగో పరుగు…
Advertisement

T20:అబుదాబిలో టీ-20 ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్ సందర్భంగా ఒక ఫన్నీ సీన్ కనిపించింది. స్టేడియం బయట పడిన బంతిని తీసుకున్న ఓ వ్యక్తి… దాన్ని తిరిగి ఇవ్వకుండా పరుగు పరుగున వెళ్లిపోయాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాన్ని చూసిన వాళ్లంతా… తెగ నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే…

డెసర్ట్‌ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఏఐ ఎమిరేట్స్‌ జట్టు బ్యాటర్ మౌస్లే… డీప్‌స్క్వేర్‌ లెగ్‌ దిశగా భారీ సిక్సర్ కొట్టాడు. బంతి ఏకంగా స్టేడియం బయట పడింది. రోడ్డు మీద వెళ్తున్న ఓ వ్యక్తి… బాల్ స్టేడియం బయట పడటం చూసి… పరుగు పరుగున దాని దగ్గరికి వచ్చాడు. అతను బంతి తీసుకుని మళ్లీ స్టేడియంలోకి విసిరేస్తాడని అంతా భావించారు. కానీ, అతను ఆ పని చేయలేదు. బంతి చేతపట్టుకుని వెళ్లిపోయాడు. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి అతణ్ని గమనించి… ఏం తీసుకెళ్తున్నావంటూ అడిగి… బాల్ చేతిలోకి తీసుకుని చూశాడు. తర్వాత నవ్వుతూ ఆ బంతిని తిరిగి అతనికే ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఇదంతా మ్యాచ్‌ను రికార్డు చేస్తున్న కెమెరా కంటికి చిక్కింది. దాంతో… ఆ వీడియోను ఐఎల్‌టి-20 తన ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. అబుదాబిలో సిక్సర్ల వర్షం కురుస్తోంది.. మీరు ఏ టైప్‌ క్రికెట్‌ లవర్స్‌.. బంతిని తీసుకొని పారిపోయేవాళ్లా? బంతిని తిరిగి ఇచ్చేవాళ్లా? చెప్పండి అంటూ కామెంట్‌ చేసింది.

Advertisement

ఈ సీన్ కనిపించిన కాసేపటికే… సేమ్ సీన్ రిపీటైంది. పొలార్డ్ కొట్టిన బంతి కూడా స్టేడియం బయటపడింది. ఈసారి కూడా ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి బంతి తీసుకున్నాడు. అతను కూడా బాల్ తీసుకుని వెళ్లిపోతాడనుకున్నారు. కానీ, అతను ఆ బంతిని తిరిగి స్టేడియంలోకి విసిరేశాడు. దాంతో… కామెంటేటర్లు అతణ్ని పొగడ్తలతో ముంచెత్తారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×