Manoj Tiwary: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా (India vs Afghanistan) మధ్య నిన్న జరిగిన రెండో వన్డే నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ) చెత్త నిర్ణయాలు తీసుకున్నాడని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ( Manoj Tiwary) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గంభీర్ గాడికి కొంచెం కూడా బుర్రలేదని.. అందుకే శుభమాన్ గిల్ ను ఓపెనర్ గా కాకుండా, ఫస్ట్ డౌన్ లో పంపించాడని ఫైర్ అయ్యారు. ఫస్ట్ డౌన్ లో వచ్చి గిల్ సెంచరీ చేశాడు కాబట్టి ఎలాంటి సమస్య రాలేదు.. అదే తొందరగా ఔట్ అయి ఉంటే, గిల్ పరిస్థితి ఏంటని నిలదీశారు. మళ్లీ ఓపెనర్ గా గిల్ ను పంపించే వాడివా ? అంటూ సీరియస్ అయ్యారు. ఇలా పదే పదే బాగా ఆడే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం ఎందుకని ప్రశ్నించారు. కెప్టెన్ గిల్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం ముమ్మాటికి తప్పేనని ఫైర్ అయ్యారు. దీంతో గౌతమ్ గంభీర్ పై మనోజ్ తివారీ చేసిన వ్యాఖ్యలు దుమారం వేపుతున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య నిన్న లక్నో వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 400 స్కోర్ చేసి ఆఫ్గనిస్తాన్ పై ఒత్తిడి పెంచింది. అటు భారీ టార్గెట్ ఉన్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్లేయర్లు కూడా చేతులెత్తేశారు. అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ గిల్, మొదటి వికెట్ కు వచ్చి బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ కు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో జైస్వాల్ నాలుగు పరుగులకే వికెట్ సమర్పించుకున్నాడు. అయితే ఫస్ట్ డౌన్ లో వచ్చిన గిల్ మాత్రం 154 పరుగులు చేసి రెచ్చిపోయాడు. అయితే కెప్టెన్ గిల్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంపై గౌతమ్ గంభీర్ ను ఉద్దేశించి మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
గౌతమ్ గంభీర్ కు అసలు బుర్రలేదని.. అందుకే ఇలా వంకర టింకర నిర్ణయాలు తీసుకొని టీమిండియాను సర్వనాశనం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. టీమిండియా కెప్టెన్ గిల్ బ్యాటింగ్ ఆర్డర్ నే మార్చే అంత మొనగాడు అయ్యాడని నిప్పులు చెరిగారు. నిన్న గిల్ సెంచరీ చేశాడు కాబట్టి గంభీర్ బతికిపోయాడు.. అదే నాలుగు పరుగులకు గిల్ అవుట్ అయి ఉంటే, మళ్లీ ఓపెనర్ గా పంపించే వాడివా ? అంటూ నిలదీశారు. బాగా ఆడే ప్లేయర్లను అస్సలు డిస్టర్బ్ చేయకూడదని కోరారు. ఇలాగే బ్యాటింగ్ ఆర్డర్ మార్చితే.. వరల్డ్ కప్ గెలవడం కష్టమేనని చురకలు అంటించారు మనోజ్ తివారీ.