Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ మరో రెండు వారాల్లోనే ప్రారంభం కానున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో… టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ పేరు మారుమోగుతోంది. టీమిండియా తరఫున ఆడాల్సిన శిఖర్ ధావన్… ఈసారి ఛాంపియన్ ట్రోఫీలో లేకపోవడం టీమిండియా కు… తీవ్ర నష్టమని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం… గత చాంపియన్ ట్రోఫీతో పాటు ఐసీసీ నిర్వహించే మెగా ఈవెంట్లలో.. గబ్బర్ అద్భుతంగా ఆడి…. తానేంటో నిరూపించాడు.
Also Read: Abhishek Sharma: హే హే కొట్టు..టీమిండియాలో మరో సెహ్వాగ్.. ఇక టెస్టుల్లోకి ఎంట్రీ ?
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ లాంటి ప్లేయర్లకు పోటీ ఇచ్చి మరి… రికార్డు స్థాయిలో పరుగులు చేశాడు శిఖర్ ధావన్. అయితే… అలాంటి ప్లేయర్ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో లేకపోవడం… టీమిండియా కు తీవ్ర నష్టం అని అంటున్నారు ఫ్యాన్స్. అదే సమయంలో శిఖర్ ధావన్ ( Shikhar Dhawan )… ఆడిన ఇన్నింగ్స్ వివరాలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
అయితే ఐసీసీ ప్రకటించిన బ్యాటింగ్ వివరాల ప్రకారం…గడిచిన చాంపియన్స్ ట్రోఫీలో… ఏ ప్లేయర్ ఏ రేంజ్ లో ఆడాడో… ఒకసారి పరిశీలిద్దాం. గత చాంపియన్ ట్రోఫీ లో 12 ఇన్నింగ్స్ లు ఆడిన విరాట్ కోహ్లీ… 529 పరుగులు చేశాడు. ఇందులో విరాట్ కోహ్లీ ఆవరేజ్ 88.2 ఉంది. అయితే… నెంబర్ వన్ స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ కంటే టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఎక్కువ పరుగులు చేశాడు.
తక్కువ మ్యాచులు ఆడి పరుగులపరంగా చూసుకున్నట్లయితే… టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తర్వాత…. శిఖర్ ధావన్ ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు 10 ఇన్నింగ్స్ లో ఆడిన శిఖర్ ధావన్ ( Shikhar Dhawan )… ఏకంగా 701 పరుగులు చేశాడు. అలాగే యావరేజ్ 77.9 గా ఉంది. అంటే విరాట్ కోహ్లీ కంటే… దాదాపు 200 పరుగులు ఎక్కువే చేశాడు శిఖర్ ధావన్. అంటే ఈసారి డేంజర్ ఆటగాన్ని టీమిండియా కోల్పోయిందని చెప్పవచ్చు.
Also Read: IND VS ENG ODI: కొత్త జెర్సీలో టీమిండియా… రోహిత్ శర్మకు ఘోర అవమానం!
శిఖర్ ధావన్ తర్వాత గంగూలీ 11 ఇన్నింగ్స్ లో 665 పరుగులు చేశాడు. అతని ఆవరేజ్ 73.9 గా ఉంది. ఆ తర్వాత మార్టిన్ నాలుగో స్థానం దక్కించుకున్నాడు. 11 ఇన్నింగ్స్ లో… మార్టిన్ 492 పరుగులు చేశాడు. ఇందులో 61.5% రన్ రేట్ ఉంది. ఇక టాప్ 5 లో రోహిత్ శర్మ 10 ఇన్నింగ్స్ లో ఆడి 481 పరుగులు చేశాడు. పది ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 53.4 యావరేజ్ సంపాదించాడు. ఎలా చూసుకున్నా అందరి కంటే శిఖర్ ధావన్ చాలా బ్రహ్మాండంగా ఆడి.. చరిత్ర సృష్టించాడు. కానీ ఈ మధ్యకాలంలో అతనికి ఛాన్సులు ఎక్కువగా రాకపోవడంతో…. రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గిల్, జైస్వాల్ లాంటి ప్లేయర్లు ఓపెనర్లు గా రాణిస్తున్న నేపథ్యంలో… శిఖర్ ధావన్ తప్పుకున్నాడు.
Virat Kohli's average in the Champions Trophy. 🤯
– India will miss Shikhar Dhawan, outrageous numbers. 🙇♂️ pic.twitter.com/5YAUF9YxzL
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 5, 2025