Donate Organs Campaign: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో.. భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశ ప్రజల కోసం… వాళ్లకు ఉపయోగపడేలా టీమిండియా ప్లేయర్లతో.. ఓ మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అవయవ అవయవ దానం చేయాలంటూ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి పిలుపునివ్వడం జరిగింది.
Also Read: Nitish Kumar Reddy: సిక్స్ ప్యాక్ తో షేక్ చేస్తున్న నితీష్ కుమార్..హీరోలు కూడా పనికిరారు !
ఇందులో భాగంగానే టీమిండియా క్రికెటర్లతో.. ఓ వీడియో చేయించి… అవయవ దానం చేయాలంటూ పిలుపునిచ్చింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇతర టీమిండియా క్రికెటర్లతో వీడియో చేయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది బీసీసీఐ. ఈనెల 12వ తేదీన అహ్మదాబాద్ లోని.. నరేంద్ర మోడీ స్టేడియంలో… టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య… చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ రోజున అవయవ దానం పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనుంది బీసీసీఐ.
అవయవ దానం చేయండి… ప్రాణాలను కాపాడండి అనే థీమ్ తో మూడో వన్డేలో ప్రత్యేక కార్యక్రమాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి చేపట్టబోతున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటన చేసింది. ఇదే విషయాన్ని టీమిండియా ప్లేయర్లతో వీడియో ద్వారా చెప్పించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. దేశవ్యాప్తంగా…. అవయవ దానం చేసేవారు కరువై… చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే.. ఈ అవయవ దానం… కార్యక్రమాన్ని తెరపైకి తీసుకువచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.
అయితే… టీమిండియా ప్లేయర్ల ద్వారా పిలుపునివ్వడం గొప్ప కార్యక్రమం. కచ్చితంగా టీమిండియా ప్లేయర్లు పిలుపునిస్తే చాలామంది ఫాన్స్ రియాక్ట్ అవుతారు. అందుకే ఈ రూట్ ఎంచుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇకనైనా అవయవ దానం చేసేవారు… ముందుకు వస్తే ఎంతోమంది ప్రాణాలను కూడా కాపాడే ఛాన్స్ ఉంటుంది. మరి టీమిండియా ప్లేయర్ల పిలుపు మేరకు ఎంతమంది అవయవ దానం కోసం ముందుకు వస్తారో చూడాలి.
ఇక టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ వివరాల్లోకి వెళితే…. ఈ రెండు జట్ల మధ్య 3 వన్డేలు జరగనుండగా… ఇప్పటికే రెండు పూర్తి అయ్యాయి. మొదటి వన్డే ఈడెన్ గార్డెన్స్, రెండవ వన్డే కటక్ వేదికగా జరగగా ఈ రెండు మ్యాచ్ లలో టీమిండియానే విక్టరీ సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. ఇక చిట్టచివరి వన్డే మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది ఈ మ్యాచ్. ఈ మ్యాచ్ వీక్షించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అలాగే జై షా వచ్చే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టూర్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్న నేపథ్యంలో ఆయన రావడంలేదని సమాచారం.
Also Read: Matthew Breetzke: వన్డేలో చరిత్ర సృష్టించిన సౌత్ ఆఫ్రికా ప్లేయర్.. LSG కి ఇక పండగే!
అవయవ దానానికి బీసీసీఐ పిలుపు..
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సహా భారత ఆటగాళ్లతో స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన బీసీసీఐ
ఈ నెల 12న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అవయవ దానంపై అవగాహన కార్యక్రమం
అవయవ దానం చేయండి.. ప్రాణాలను కాపాడండి అనే థీమ్ తో 3వ వన్డేలో ప్రత్యేక… pic.twitter.com/85f7KKVb36
— BIG TV Breaking News (@bigtvtelugu) February 10, 2025