Kamran Akmal: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Pakistan Super League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. అదే సమయంలో IPL 2026 కూడా అంత కంటే ఎక్కువ జోష్ లో దూసుకు వెళ్తోంది. అయితే ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ ఆటగాడు నసీమ్ షా పైన ( NASEEM SHAH ) వేటు పడిన సంగతి తెలిసిందే. మరియం నవాజ్ షరీఫ్ ను ఉద్దేశించి వివాదాస్పద పోస్ట్ పెట్టిన నేపథ్యంలో నసీమ్ షాపై ఫైన్ విధించారు. అయితే ఈ వ్యవహారంపై తాజాగా పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ( KAMRAN AKMAL) షాకింగ్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ ప్లేయర్ల లాగా ఇండియన్ క్రికెటర్లు ఎవరూ కూడా రాజకీయ నాయకులపై కామెంట్లు చేయబోరని చురకలు అంటించారు. కానీ అనవసరంగా నసీమ్ షా ట్వీట్ చేశాడని ఆగ్రహించారు. దీంతో కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం తెలుపుతున్నాయి.
Also Read: PSL 2026: PSLను అతలాకుతలం చేసిన తుఫాన్..గాల్లో ఎగిరిపడ్డ గ్రౌండ్ మెన్లు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఓపెనింగ్ సెర్మనీకి వచ్చిన మరియం నవాజ్ షరీఫ్ ను ( NASEEM SHAH ) ఉద్దేశించి నసీమ్ షా వివాదాస్పద పోస్ట్ పెట్టారు. అయితే ఈ అంశం పైన తాజాగా కమ్రాన్ అక్బర్ స్పందించారు. మరియం నవాజ్ షరీఫ్ లాంటి పాకిస్తాన్ బడా పొలిటీషియన్ పైన కమ్రాన్ అక్మల్ ( Akmal) వివాదాస్పద పోస్టులు పెట్టడం దారుణం అన్నారు. ఆమెను కామెంట్ చేయడానికి కొంచమైనా బుద్ధి ఉందా ? ? తెలివి తక్కువ తనంతో నసీమ్ షా పోస్ట్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో టీమిండియా క్రికెటర్లను ఉద్దేశించి కూడా కమ్రాన్ అక్మల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. టీమిండియా క్రికెటర్లు ఎన్నో కోట్లు సంపాదిస్తున్నారు..
అలాంటి ప్లేయర్లు కూడా ఇండియన్ పాలిటిక్స్ లో ఎలాంటి జోక్యం చేసుకోరు అని తెలిపారు. రాహుల్ గాంధీ లాంటి బడా లీడర్లు పప్పు అని తిట్టగలరా..? మోడీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ నేతల జోలికి టీమిండియా క్రికెటర్లు అస్సలు వెళ్ళరని వివరించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా టీమిండియా క్రికెటర్లు న్యూట్రల్ గా ఉంటూ క్రికెట్ పైన దృష్టి పెడతారని కమ్రాన్ అక్మల్ తెలిపారు. టీమిండియా క్రికెటర్లను చూసి నసీమ్ షా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. క్రికెటర్లకు రాజకీయాల గురించి అస్సలు అవసరం లేదన్నారు. అనవసరంగా వేలు పెడితే, నసీమ్ షాకు పడిన శిక్ష ప్రతి ఒక్కరికి పడుతుందని హెచ్చరించారు. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో నసీమ్ షాపై 2 పీకేఆర్ కోట్ల ఫైన్ విధించింది. ఇమ్రాన్ ఖాన్ ను నసీమ్ షా నిత్యం మెచ్చుకునేవాడు. ఈ క్రమంలోనే నసీమ్ షాను టార్గెట్ చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.
Also Read: Shahid Afridi: నాకు ఛాన్స్ ఇవ్వండి..టీమిండియాకు 100 మంది బుమ్రాలను తయారు చేస్తా
🚨 MASSIVE STATEMENT BY KAMRAN AKMAL ON NASEEM SHAH AND INDIAN CRICKETERS🚨
Kamran Akmal said 🗣️
"When you are part of the system, you have to stay neutral. You focus on your cricket." He drew a pointed parallel, noting that Indian cricketers under BCCI contracts similarly… pic.twitter.com/uLts6zmI0d
— Cricket Central (@CricketCentrl) April 1, 2026