E-Paper

వోక్స్‌ వ్యాగన్ బిగ్ ప్లాన్.. ఏకంగా 4 కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

వోక్స్‌ వ్యాగన్ బిగ్ ప్లాన్.. ఏకంగా 4 కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయ్!
Advertisement

Upcoming Volkswagen Cars 2026: వోక్స్‌ వ్యాగన్ భారత మార్కెట్లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగానే కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇండియా 2.0 వ్యూహంలో భాగంగా ఇప్పటికే కొన్ని కొత్త కార్లను తీసుకొచ్చిన ఈ జర్మన్ ఆటోమొబైల్ సంస్థ, ఇప్పుడు మరిన్ని అప్‌ డేటెడ్ మోడళ్లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నిస్తోంది. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1.వోక్స్‌ వ్యాగన్ వర్టస్ ఫేస్‌ లిఫ్ట్

ఈ లిస్టులో వోక్స్‌ వ్యాగన్ వర్టస్ ఫేస్‌ లిఫ్ట్ ఫస్ట్ ప్లేస్ లో  ఉంది. ఇటీవల టైగన్ ఫేస్‌ లిఫ్ట్ విడుదలైన తర్వాత, కంపెనీ ఇప్పుడు సెడాన్ సెగ్మెంట్‌ పై పెట్టింది. టెస్టింగ్ దశలో కనిపించిన వర్టస్ ఫేస్‌ లిఫ్ట్‌ లో కొత్త డిజైన్ కనిపించింది. ఇందులో కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌ ల్యాంప్ డిజైన్, అలాగే అప్‌డేటెడ్ బంపర్ ఉండనుంది. వెనుక భాగంలో LED టెయిల్ ల్యాంప్స్, కొత్త లైట్ బార్ డిజైన్ మరింతగా ఆకట్టుకోనుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే, ఈ అప్‌ డేటెడ్ వర్టస్‌ లో అధునాతన ఫీచర్లు, కొత్త క్యాబిన్ లే అవుట్ ఉండే అవకాశం ఉంది. ఇంజిన్ పరంగా మాత్రం పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. 1.0-లీటర్ TSI, 1.5-లీటర్ TSI ఇంజిన్ ఆప్షన్లు కొనసాగుతాయి. చిన్న ఇంజన్‌ కు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ లు, అలాగే 1.5 లీటర్ వేరియంట్‌ కు DSG గేర్‌ బాక్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

2.వోక్స్‌ వ్యాగన్ టేరాన్ నాన్ ఆర్ లైన్

Advertisement

వోక్స్‌ వ్యాగన్ టేరాన్ నాన్ ఆర్ లైన్ వెర్షన్ కూడా త్వరలో మార్కెట్ లోకి రానుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టేరాన్ ఆర్ లైన్ ఫ్లాగ్‌ షిప్ SUVగా కొనసాగుతోంది. దీని ధర ఎక్కువగా ఉండటంతో, కంపెనీ మరింత అందుబాటులో ఉండే నాన్ ఆర్ లైన్ వెర్షన్‌ ను తీసుకురావాలని భావిస్తోంది. ఈ కొత్త వేరియంట్ అదే పవర్‌ ట్రెయిన్‌ తో వస్తుంది. కానీ, ఫీచర్లలో కొంత తగ్గింపు ఉండే అవకాశం ఉంది. దీనివల్ల ధరను తగ్గించి మరింత మంది వినియోగదారులను ఆకర్షించవచ్చు.

3.గోల్ఫ్ జీటీఐ సెకెండ్ బ్యాచ్

మూడవ మోడల్‌గా గోల్ఫ్ జీటీఐ రెండవ బ్యాచ్ మార్కెట్లోకి రానుంది. గతంలో విడుదలైన మొదటి బ్యాచ్ చాలా తక్కువ సమయంలోనే పూర్తిగా అమ్ముడైపోయింది. దీనికి వచ్చిన భారీ స్పందన కారణంగా వోక్స్‌ వ్యాగన్ రెండవ బ్యాచ్‌ ను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ హాట్ హ్యాచ్‌ బ్యాక్ 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ తో వస్తుంది. ఇది 265 బీహెచ్‌పీ పవర్‌ ను అందిస్తుంది. 7-స్పీడ్ DSG గేర్‌ బాక్స్ దీనికి యాడ్ చేస్తుంది. ఇది పూర్తిగా కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ గా భారత్‌ కు రానుంది. .

4.కొత్త SUV

Advertisement

వోక్స్‌ వ్యాగన్ కైలాక్ ఆధారంగా కొత్త సబ్-4 మీటర్ల SUVపై కూడా పని చేస్తోంది. ఈ సెగ్మెంట్‌ లో కైలాక్ మంచి సక్సెస్ అందుకోవడంతో అదే ప్లాట్‌ ఫారమ్‌ పై మరో మోడల్‌ ను అభివృద్ధి చేస్తోంది. ఈ SUVలో కొత్త డిజైన్ ఎలిమెంట్లు, కైలాక్ కంటే భిన్నమైన స్టైలింగ్ ఉండనుంది. ఇది 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ తో వస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ కొత్త SUV వచ్చే ఏడాది మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

Read Also: హోండా కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఆ మోడళ్లపై రూ.2.15 లక్షల వరకు ఆదా!

Related News

సెకండ్‌ హ్యాండ్ ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్.. పెట్రోల్ కార్ల కంటే వేగంగా పెరుగుతున్న రేట్లు!

ఒకేసారి 3 క్రేజీ ఎలక్ట్రిక్ కార్లు.. విన్‌ ఫాస్ట్ ప్లాన్ అదిరింది భయ్యా!

హోండా కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఆ మోడళ్లపై రూ.2.15 లక్షల వరకు ఆదా!

టాటా నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ SUVలు.. ప్లాన్ అదిరింది మాస్టారూ!

ప్లగ్ ఇన్ హైబ్రిడ్ vs స్ట్రాంగ్ హైబ్రిడ్.. ఇండియన్స్ వినియోగదారులకు ఏది బెస్ట్?

హైబ్రిడ్ SUVలపై హ్యుందాయ్, కియా ఫోకస్.. అదిరిపోయే మోడళ్లు రెడీ!

డ్రైవింగ్ రాకపోయినా నో టెన్షన్.. ఇక హ్యాపీగా కారులో వెళ్లొచ్చు!

×