BigTV English

Matthew Wade : అందువల్లే ఓడిపోయాం: ఆసిస్ కెప్టెన్ వేడ్

Matthew Wade : అందువల్లే ఓడిపోయాం: ఆసిస్ కెప్టెన్ వేడ్
Matthew Wade

Matthew Wade : ఆస్ట్రేలియా-ఇండియా టీ 20 ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆఖరి మ్యాచ్ బెంగళూరులో జరిగింది. అయితే చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో ఆసిస్ పరాజయం పాలైంది. మ్యాచ్ అనంతరం ఆఖరి ఓవర్ వరకు టెన్షన్ పెట్టిన మ్యాచ్ పై ఆసిస్ కెప్టెన్ మ్యాథ్యూ వేడ్ స్పందించాడు.


ఆఖరి టీ 20 మ్యాచ్ గెలవాల్సింది. కానీ బ్యాటర్ల వైఫల్యం వల్ల ఓటమి పాలయ్యామని కెప్టెన్ మాథ్యూ వేడ్ తెలిపాడు. అదే పొరపాటు పదేపదే చేశామని అన్నాడు. పిచ్ స్వభావానికి తగినట్టుగా మా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఇండియాని తక్కువ స్కోరుకే ఆపగలిగారు. కానీ వాళ్లిచ్చిన అవకాశాన్ని మా బ్యాటర్లు నిలబెట్టలేకపోయారని తెలిపాడు. సీనియర్లు వెళ్లిన తర్వాత వీళ్లు వచ్చారు. ఇంకా ఇక్కడి వాతావరణానికి అలవాటు పడలేదు. వెంటవెంటనే మ్యాచ్ లు జరగడంతో వారు తడబడినట్లు తెలిపాడు.

లోస్కోరు మ్యాచ్ లో కూడా విజయం సాధించలేకపోయాం. నిజంగా ఇది మాకొక గుణపాఠమని చెప్పాలి. పొరపాట్లు ఎక్కడ జరిగాయన్నది తెలుసుకుని, పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్నాడు. బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ లో రావాలని జట్టులో డిస్కర్షన్ జరిగింది. కానీ నేను అప్పుడు రావడమే బెటర్ అని అన్నాడు.


ఎందుకంటే ఓడిపోయే మ్యాచ్ లను టెయిల్ ఎండర్స్ సహాయంతో గెలిపించాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. అది చాలా పెద్ద టాస్క్, ఛాలెంజ్ తో కూడుకున్నది…అందుకని నేనక్కడ బ్యాటింగ్ చేయడానికే ఇష్టపడతానని అన్నాడు. నాకు రికార్డ్స్ మీద ఆశ లేదు. లేదంటే ఓపెనర్ గా వచ్చేవాడిని. ఇప్పుడు నా పాత్ర మరొకరు పోషించేవారని తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే బాగుండేదని అన్నాడు. లోస్కోర్ కదా.. తప్పక గెలుస్తామని అనుకున్నాను. అది బాగా డిజప్పాయింట్ చేసిందని అన్నాడు. బెన్ మెక్‌డెర్మాట్ అద్భుతంగా పుంజుకున్నాడు. కఠిన పరిస్థితుల్లో, జాసన్ బెరెండార్ఫ్ , బెన్ డ్వార్షిస్, సంగ ప్రభావం చూపించారని మాథ్యూ వేడ్ ప్రశంసలు కురిపించాడు. మొత్తానికి అటు సీనియర్స్ జట్టు ప్రపంచకప్ నే తీసుకువెళితే, వీళ్లు ఉత్త చేతులతో వెళుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Related News

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Big Stories

×