SA20 Final: SA20 టోర్నమెంట్ లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ( Sunrisers Eastern Cape) కు ఎదురు దెబ్బ తగిలింది. SA20 టోర్నమెంట్ విజేతగా ముంబై కేప్ టౌన్ ( MI Cape Town ) జట్టు నిలిచింది. ఫిబ్రవరి 8వ తేదీన జరిగిన సౌత్ ఆఫ్రికా 20 టోర్నమెంట్ లో గ్రాండ్ విక్టరీ కొట్టి ఛాంపియన్ గా నిలిచింది ముంబై. ఇప్పటికే రెండుసార్లు విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టును చిత్తు చిత్తుగా ఓడించేసింది ముంబై కేప్ టౌన్ ( MI Cape Town ).
Also Read: Rachin Ravindra: రచిన్ రవీంద్రకు తీవ్ర గాయం…ఆస్పత్రికి తరలింపు!
ఈ ఫైనల్ మ్యాచ్ లో కావ్య పాపకు చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టును 76 పరుగుల తేడాతో మట్టికరిపించి… గ్రాండ్ విక్టరీ కొట్టింది ముంబై. దీంతో SA 20 టోర్నమెంట్ 2025 విజేతగా ముంబై కేప్ టౌన్ ( MI Cape Town ) నిలవడం జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో… అద్భుతంగా బౌలింగ్ చేసిన ముంబై బౌలర్ ట్రెంట్ బోల్ట్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసిన బోల్ట్ 9 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయడం జరిగింది. దీంతో ఫైనల్ మ్యాచ్ లో సన్రైజర్స్ జట్టు కకావికులమైంది. అందుకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా బోల్టు… సెలెక్ట్ అయ్యాడు.
ఇక ఈ మ్యాచ్ వివరాలు ఒకసారి పరిశీలిస్తే… ఈ మ్యాచ్ లో మొదట ముంబై బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు… నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది. సన్రైజర్స్ బౌలర్లు… సరైన లెన్త్ తో బౌలింగ్ చేయకపోవడంతో… ముంబై భారీ స్కోర్ చేయగలిగింది. ఇక ముంబై ఇన్నింగ్స్ లో… ఏ ఒక్క ప్లేయర్ 40 పరుగులు చేయలేకపోయినా… సమిష్టిగా తలా కొన్ని పరుగులు చేశారు. ముంబై ఇన్నింగ్స్ లో… కోణార్ 39 పరుగులు చేయగా, డేవాల్డ్ బ్రేవిస్ 38 పరుగులు చేసి… రాణించాడు. ఇక వికెట్ కీపర్ రికెల్టన్ 33 పరుగులు చేసి.. జట్టుకు అమూల్యమైన పరుగులు అందించాడు. లిండే 20 పరుగులు… దుస్సేన్ 23 పరుగులు చేశారు. ఇక ముంబై కెప్టెన్ రషీద్ ఖాన్ డక్ అవుట్ కాగా… హెన్రిక్స్, కోరబిన్ కూడా అండకౌట్ అయ్యాడు. ఇక 182 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో… సన్రైజర్స్ దారుణంగా విఫలమైంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంటులో… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలా ఫైనల్ లో విఫలమైందో… అచ్చం ఇక్కడ అదే జరిగింది. అక్కడ కేకేఆర్ చేతిలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓడిపోతే… ఇక్కడ ముంబై చేతిలో సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ఓడిపోవడం జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో 18.4 ఓవర్లు ఆడిన సన్రైజర్స్…. 105 పరుగులకే ఆల్ అవుట్ అయింది. టామ్ అంబెల్ ఒక్కడే 30 పరుగులు చేయగా టోనీ 26 పరుగులు చేయగలిగాడు. ఇక సన్రైజర్స్ కెప్టెన్ ఐడెన్ మార్కరం… దారుణంగా విఫలమై ఆరుపరుగులకే అవుట్ అయ్యాడు. ఇలా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎవరూ కూడా రాణించకపోవడంతో… 105 పరుగులకే కుప్పకూలింది సన్రైజర్స్. కాగా ఇప్పటికే రెండు టోర్నమెంట్ లలో ఛాంపియన్ గా నిలిచిన సన్రైజర్స్… ఈసారి ఫైనల్ లో ఓడింది. దీంతో మొదటిసారి SA 20 ముంబై చాంపియన్ గా నిలిచింది.
Also Read: Champions Trophy 2025: PCBపై రిజ్వాన్ తిరుగుబాటు..యాక్షన్ తీసుకోనున్న ఛైర్మన్ నఖ్వీ ?
The #BetwaySA20 trophy will be heading home with MI Cape Town 🏆 #BetwaySA20Final #MICTvSEC #WelcomeToIncredible pic.twitter.com/gGZTXHVOTn
— Betway SA20 (@SA20_League) February 8, 2025