Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 ) కంటే ముందు.. పాకిస్తాన్ జట్టులో పెను ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ ( Mohammad Rizwan ) వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) మధ్య… వివాదాలు తెరపైకి వచ్చాయి. ఇతర మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 ) కోసం… ప్రకటించిన జట్టులో మార్పుల గురించి పాకిస్తాన్ కెప్టెన్ రిజ్వాన్ వర్సెస్ పిసిబి చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. మహమ్మద్ రిజ్వాన్ ఒక మాట అంటే… పిసిబి చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) మరొక మాట అంటున్నారు.
Also Read: Sreesanth- Sanju: సంజు పంచాయితీ… కేరళ క్రికెట్ ను గెలికిన వివాదాస్పద బౌలర్ శ్రీశాంత్ ?
దీంతో… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు సంబంధించిన గొడవలు బజారున పడ్డాయి. చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 ) కోసం… ప్రకటించిన పాకిస్తాన్ జట్టులో ఎలాంటి మార్పు ఉండబోదని… ఆ జట్టు కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ ప్రకటించారు. జనవరి ఒకటో తేదీన ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 ) కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB). అయితే ఇందులో మార్పులు చేయాలని కొంత మంది డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో…. పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ మాత్రం భిన్నంగా స్పందించారు. ఒకసారి జట్టును ప్రకటించిన తర్వాత మార్పులు చేర్పులు ఉండబోవని… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం ఫైనల్ అంటూ… చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు మహమ్మద్ రిజ్వాన్.
అయితే మహమ్మద్ రిజ్వాన్… కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) భిన్నంగా స్పందించారు. రిజ్వాన్ చేసిన కామెంట్లను ఖండించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 ) జట్టు లో కచ్చితంగా మార్పులు ఉంటాయని చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) ప్రకటించడం జరిగింది. మహమ్మద్ రిజ్వాన్ మాటలు ఎవరు కూడా నమ్మకూడదని.. తన నిర్ణయమే ఫైనల్ అంటూ చెప్పుకొచ్చారు.
Also Read: Shubman Gill: అమ్మాయిలతో గిల్ సెల్పీలు… కుళ్లుకుంటున్న సారా ?
సెలెక్టర్లు 15 మంది సభ్యులను సెలెక్ట్ చేశారని… కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ గా తన నిర్ణయం ఫైనల్ అంటూ… వెల్లడించారు మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ). ఫిబ్రవరి 12వ తేదీ వరకు… పాకిస్తాన్ జట్టులో ఎలాంటి మార్పులైనా జరగవచ్చని… అలా మార్పులు చేసే హక్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ( PCB) ఉంటుందని వివరించారు. ఖుష్దిల్ షా, ఫహృమ్ అష్రఫ్ లను ఇద్దరినీ తొలగించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. వాళ్లిద్దరూ వన్డేలు ఆడి.. రెండు ఏళ్లు అయిందని.. వాళ్ల రేటింగ్ కూడా బాగాలేదన్నారు. దీంతో.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 ) కంటే ముందు..పాకిస్థాన్ జట్టులో కల్లోలం మొదలైందని అంటున్నారు.