BigTV English

MI In Eliminator : దరిద్రం అంటే ఇదే…ఇలాగైతే ముంబై కప్ కొట్టడం కష్టమే!

MI In Eliminator : దరిద్రం అంటే ఇదే…ఇలాగైతే ముంబై కప్ కొట్టడం కష్టమే!

MI In Eliminator : ఐపీఎల్ 2025 సీజన్ లో ముంబై జట్టుకి షాక్ తగిలిందనే చెప్పాలి. ప్రారంభంలో 5 మ్యాచ్ ల్లో ఓడిపోయిన ఈ జట్టు వరుస విజయాలతో టాప్ లోకి దూసుకొచ్చింది. కానీ ప్లే ఆప్స్ కి చేరువయ్యే కీలక మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో విజయం సాధించలేక నాలుగో స్థానానికి పరిమితం అయింది. ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధిస్తే.. ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధిస్తే.. రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ గెలిస్తే.. ముంబై జట్టు రన్ రేట్ కారణంగా టాప్ ప్లేస్ లోకి వెళ్లే అవకాశముండేది. అయినప్పటికీ లక్నో విజయం సాధిస్తే మాత్రమే ముంబైకి ఛాన్స్ ఉండేది. కానీ ముంబై ఓడిపోవడంతో ముంబైకి దరిద్రం పట్టిందని అభిమానులు పేర్కొంటున్నారు.


Also Read :  Yuvraj Singh – GT : నెహ్రా అదిరిపోయే ప్లాన్.. ప్లే ఆఫ్స్ కోసం ఆ రాక్షసుడిని దింపుతున్నాడు

ప్రస్తుతం ముంబై జట్టు 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అయితే ఈ సీజన్ లో ఈ జట్టు పడుతూ లేస్తూ.. ముందుకు వెళ్తోంది. ఇప్పటివరకు ప్లే ఆప్స్ కి వెళ్లిన జట్ల పై ముంబై ఇండియన్స్ విజయం సాధించలేదు. ఈ సీజన్ లో ప్లే ఆప్స్ కి చేరిన గుజరాత్ టైటాన్స్ పై రెండు సార్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ఒకసారి.. అలాగే పంజాబ్ కింగ్స్ పై కూడా ఒక్కసారి ఓటమి చవి చూసింది. క్వాలిఫయిర్స్, ఎలిమినేటర్ మ్యాచ్ ల్లోనే ఇవే జట్లు ఎదురుకానున్నాయి. దీంతో ముంబై ఇండియన్స్ ఈ జట్ల పై గెలవడం పెద్ద సవాల్ గా మారింది. బలమైన ఈ 3 జట్ల పై ముంబై ఇండియన్స్ గెలిచి కప్ కొట్టడం కష్టం అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ముంబై ఇండియన్స్ క్రికెట్ అభిమానులు ఈసారి కూడా కప్ ముంబై దే అని ధీమాతో ఉన్నారు. ప్లే ఆప్స్ లోని కీలక మ్యాచ్ ల్లో విజయం సాధించి కచ్చితంగా టైటిల్ గెలుస్తుంది అని ఛాలెంజ్ లు చేయడం విశేషం.


ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటి వరకు లీగ్ దశలో ఇప్పటివరకు 14 మ్యాచ్ లు ఆడితే అందులో 8 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఇక 6 మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో 16 పాయింట్లు ఉన్నాయి. అయితే ఈ జట్టు కి రన్ రేట్ మాత్రం +1.142 ఉండటం విశేషం. లీగ్ దశలో ఢిల్లీ మ్యాచ్ గెలిస్తే.. ముంబై ఇంటి బాట పట్టేది అని ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు పేర్కొంటున్నారు. ఊహించని రీతిలో పంజాబ్ కింగ్స్ జట్టు ముంబై పై విజయం సాధించి 19 పాయింట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఈ సీజన్ లో మరీ టైటిల్ ఏ జట్టు సాధిస్తుందో మరీ.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×