BigTV English

MLC 2025 Bizarre Run-out : దున్నపోతు మీద వాన కొట్టినట్టే.. పోలార్డ్ దారుణంగా రనౌట్

MLC 2025 Bizarre Run-out : దున్నపోతు మీద వాన కొట్టినట్టే.. పోలార్డ్ దారుణంగా రనౌట్

MLC 2025 Bizarre Run-out : ప్రస్తుతం MLC 2025 లీగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే  MI న్యూయార్క్ వర్సెస్ టెక్సాస్ సూపర్ కింగ్స్‌ మధ్య జరిగినటువంటి మ్యాచ్ లో ఓ  ఆసక్తికర సంఘటన చోటు చేసుకోవడం విశేషం. ముఖ్యంగా MI న్యూయార్క్ స్టార్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ విచిత్రంగా.. ఎవ్వరూ ఊహించని విధంగా రనౌట్ కావడం విశేషం. చివరి ఓవర్ లో పోలార్డ్ తన జట్టు లక్ష్యాన్ని ఛేదించడానికి కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పలు బౌండరీలు కొట్టి ఒత్తిడిని తగ్గించిన తరువాత.. పోలార్డ్ లెగ్ సైడ్ వైపు బంతిని కొట్టాడు. ఆ బంతిని కొట్టిన వెంటనే సింగిల్ తీయడం కోసం పరుగెత్తడం ప్రారంభించాడు.


పోలార్డ్ రనౌట్ దారుణం..

అయితే త్రో సకాలంలో స్టంప్ లను చేరుకోదని భావించి మధ్యలో వేగాన్ని తగ్గించాడు. కానీ టెక్సాస్ సూపర్ కింగ్స్ ఆటగాడు డారిల్ మిచెల్ వేగంగా బంతిని పట్టుకొని నేరుగా త్రో చేశాడు. దీంతో బంతి వికెట్లకు తాకింది. జస్ట్ పోలార్డ్ బ్యాట్ పెడితే నాటౌట్ అయ్యేవాడు. కానీ బంతి తగులుతుందా..? అని నెగ్లెట్ చేయడంతో ఔట్ గా వెనుదిగాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పోలార్డ్ పై సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా బ్రెయిన్ పని చేయలేదా..? అసలు బ్యాట్ ఎందుకు పెట్టలేదు. “Brain fade by Pollard” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. పొలార్డ్ రనౌట్ కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం.


దున్నపోతు మీద వాన కురిసినట్టే.. 

పోలార్డ్ చేసిన ఈ పొరపాటు పై మ్యాచ్ తరువాత ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఒత్తిడిలో ఎంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లు కూడా ఇలా ఖరీదైన తప్పులు చేస్తారో ఇట్టే స్పష్టంగా అర్థం అవుతోంది. ఓక్లాండ్ లో జరిగిన ఉత్కంఠ భరితమైన ఈ మ్యాచ్  లోటెక్సాస్ సూపర్ కింగ్స్ పై చేయి సాధించింది. తొలుత MI న్యూయార్క్ పరుగుల వేట ప్రారంభమైనప్పుడు ఓపెనర్లు అగ్ని చోప్రా, క్వింటన్ డీకాక్ సింగిల్ విఫలం చెందారు. మొనాంక్ పటేల్ 44 బంతుల్లో 62 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు. బ్రేస్ వెల్ 38, కీరన్ పొలార్డ్ 32 పరుగులు చేశాడు. చివరి ఓవర్ లో 6 బంతుల్లో 8 పరుగులు చేయాల్సి ఉంటే.. కేవలం 5 పరుగులు మాత్రమే చేశారు. 3 పరుగుల తేడాతో టెక్సాస్ సూపర్ కింగ్స్ విజయం సాధించింది.  ప్రధానంగా పోలార్డ్ పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. దున్నపోతు మీద వాన కురిసినట్టేనా..? పోలార్డ్  రనౌట్ కావడం దారుణం అని పేర్కొంటున్నారు. గతంలో ముంబై ఇండియన్స్ తరపున కీలక ఆటగాడిగా కొనసాగాడు. టీ-20 ఫార్మాట్ లో 900 సిక్స్ లు బాదిన రెండో క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు. క్రిస్ గేల్ తరువాత.. మరో వెస్టిండిస్ ఆటగాడు ఇలా రికార్డులు సాధించాడు. ఇలా ప్రతీ విషయంలో రికార్డులకెక్కిన పోలార్డ్ ఇలా రనౌట్ పై చర్చించుకోవడం విశేషం. 

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×