Charlapalli-Tirupati Special Trains: సమ్మర్ సెలవులు ముగిసిన నేపథ్యంలో ప్రజలు సొంతూళ్ల నుంచి పట్టణాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులు కిటకిటలాడుతున్నారు. రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. దీంతో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది.
జులై 2 నుంచి 31 వరకు ప్రత్యేక రైళ్ల కొనసాగింపు
పెరిగిన ప్రయాణీకుల రద్దీని కంట్రోల్ చేయడానికి దక్షిణ మధ్య రైల్వే సుమారు నెల రోజుల పాటు ప్రత్యేక రైళ్లను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. జూలై 2 నుంచి జూలై 31 వరకు చర్లపల్లి- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ప్రయాణీకులు రద్దీకి అనుగుణంగా వివిధ కోచ్ క్లాస్ లలో నాలుగు నంబర్లు సర్వీసులు అందుబాటులో ఉంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు.
చర్లపల్లి- తిరుపతి మధ్య నడిచే రైళ్ల వివరాలు
అదనపు ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి, దక్షిణ మధ్య రైల్వే (SCR) చర్లపల్లి- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ఇప్పటికే చాలా రోజుల నుంచి నడుపుతుంది.
⦿ చర్లపల్లి – తిరుపతి (07017) రైలు: జూలై 4- 27 మధ్య నడుస్తుంది.
⦿ తిరుపతి – చర్లపల్లి (07018) రైలు: జూలై 5- 28 మధ్య నడుస్తుంది.
⦿ చర్లపల్లి – తిరుపతి (07251) రైలు: జూలై 2- 30 మధ్య నడుస్తుంది.
⦿ తిరుపతి – చర్లపల్లి (07252) రైలు: జూలై 3- 31 మధ్య నడుస్తాయి.
Read Also: దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్.. విశాఖ మెట్రో ప్రత్యేకతే వేరు!
ప్రత్యేక రైళ్లలో ఏ క్లాస్ లు ఉంటాయంటే?
చర్లపల్లి- తిరుపతి మధ్య నడిచే ప్రత్యేక రైళ్లలో పలు క్లాస్ ల కోచ్ లు ఉంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లలో 1AC, 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని వెల్లడించారు. ప్రయాణీకులు ఈ అదనపు రైళ్లను వినియోగించుకోవాలని సూచించారు. ఇబ్బందులు లేని ప్రయాణాలు సాగించాలన్నారు. ఈ ప్రత్యేక రైళ్లతో చర్లపల్లి-తిరుపతి మధ్య రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులకు ప్రయోజనం కలగనుంది.
Read Also: విమానంలో ఇంధన ట్యాంక్ ఎక్కడ ఉంటుంది? ఎమర్జెన్సీ టైమ్ లో ఏం చేస్తారు?