IPL Controversies: మొన్నటివరకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బజ్ కొనసాగింది. ఇక ఇప్పుడు క్రికెట్ అభిమానులను అలరించడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} రెడీ అవుతుంది. ఈ ఐపిఎల్ 18 వ సీజన్ మార్చ్ 22 నుండి ప్రారంభం కాబోతోంది. ఫైనల్ మ్యాచ్ మే 25న జరుగుతుంది. అయితే ఈ ఐపీఎల్ లో ప్రతి సీజన్లోనూ కొత్త రికార్డులను సెట్ చేయడం, వాటిని వచ్చే సీజన్లలో బద్దలు కొట్టడం చేస్తూనే ఉంటుంది.
ఈ ధనాధన్ లీగ్ 2008లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి సీజన్ నుండి ఇప్పటివరకు తన పాపులారిటీని సీజన్ సీజన్ కి పెంచుకుంటూనే పోతుంది ఐపీఎల్. ఈ ఐపీఎల్ లో రసవత్తర మ్యాచ్ లు మాత్రమే కాదు తీవ్రమైన వాగ్వాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ లీగ్ ప్రారంభం నుండి అనేక వివాదాలకు వేదిక అయింది. గడిచిన 17 సీజన్లలో అనేక వివాదాలు జరిగాయి. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, ఆటగాళ్ల సస్పెన్షన్, వాగ్వాదాలు ఇలా చాలానే జరిగాయి.
వీటివల్ల కొందరు టోర్నీ నుండి సస్పెండ్ కాగా.. మరికొందరు అరెస్ట్ ఐన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఆటగాళ్లు మాత్రమే కాదు ఆయా ప్రాంచైజీల యాజమాన్లు కూడా ఈ వివాదాలలో చిక్కుకున్నారు. ఈ ఐపీఎల్ ప్రారంభమైన 2008 ఎడిషన్ నుండి ఇప్పటివరకు జరిగిన కొన్ని కాంట్రవర్సీలు ఏంటో చూద్దాం. 2013 లో ముంబై ఇండియన్స్ తరఫున హర్భజన్ సింగ్, పంజాబ్ తరఫున శ్రీశాంత్ ఆడారు.
అయితే మ్యాచ్ అనంతరం శ్రీశాంత్ ని హర్భజన్ చెంపదెబ్బ కొట్టడం పెద్ద దుమారం రేపింది. అనంతరం శ్రీశాంత్ అసభ్య పదజాలం వాడడం వల్లే హార్భజన్ చేయి చేసుకున్నట్లు తెలిసింది. అనంతరం హర్భజన్ పై బీసీసీఐ చర్యలు తీసుకొని అతడిని సీజన్ నుంచి తొలగించింది. ఇక ఆర్థిక అవకతవకలు జరిగాయ టు ఆరోపణలు ఎదుర్కొండా లలిత్ మోడీ 2010వ సంవత్సరంలో ఐపీఎల్ నుండి సస్పెన్షన్ కి గురయ్యాడు.
అనంతరం అతడిని క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ నుండి తొలగించారు. ఇక 2012 సంవత్సరంలో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం ఆరోపణలు సంచలనం రేపాయి. ఇందులో సీఎస్కే జట్టు అధ్యక్షుడు గురునాథ్ ముయ్యప్పన్, రాజస్థాన్ రాయల్స్ యాజమాని రాజ్ కుంద్రా పేరు స్పాట్ ఫిక్సింగ్ లో వచ్చింది. శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలా ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ముగ్గురికి క్రికెట్ లో జీవితకాల నిషేధం విధించారు. అలాగే సీఎస్కే, ఆర్ఆర్ జట్లను రెండు సీజన్ల పాటు సస్పెండ్ చేశారు. మరో ఆసక్తికర సంఘటన 2013 మే 12న విరాట్ కోహ్లీ – గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆర్సిబి, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య మాటల యుద్ధం జరిగింది. వీరిద్దరూ కొట్టుకునేలా కనిపించారు. కానీ అక్కడ ఉన్నవారు కలగజేసుకోవడంతో గొడవ సర్దుమనిగింది. వీరి గొడవకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు వీరిద్దరి మధ్య వివాదం కొనసాగుతూనే వచ్చింది.