Mike Smith as Pakistan’s red-ball batting coach: పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైన సంగతి తెలిసిందే. వైట్ బాల్ క్రికెట్ లో అడపాదడపా మ్యాచులు గెలుస్తున్న పాకిస్తాన్… టెస్టుల్లో మాత్రం చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ షాన్ మసూద్ ను దించేసి.. బాబర్ ఆజంకు అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ పాకిస్తాన్ తలరాత మారడం లేదు. బ్యాటింగ్ లో అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ తలరాత మార్చేందుకు PCB మరో మాస్టర్ ప్లాన్ వేసింది. పాకిస్తాన్ బ్యాటింగ్ ప్రదర్శనను మెరుగుపరిచేందుకు కొత్త కోచ్ ను తీసుకురాబోతోంది. మైక్ స్మిత్ ను ఈ మేరకు బరిలోకి దింపనుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.
టెస్ట్ క్రికెట్ లో చెత్త ప్రదర్శన కనబరుస్తున్న పాకిస్తాన్ జట్టును మెరుగుపరిచేందుకు PCB షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ రెడ్ బాల్ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్ ను నియామకం చేసింది. దక్షిణాఫ్రికాకు సంబంధించిన మైక్ స్మిత్ ఇకపై పాకిస్తాన్ టెస్ట్ బ్యాటింగ్ కోచ్ గా పని చేయనున్నారు. త్వరలో ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఆగస్టు 19వ తేదీ నుంచి ఈ టోర్నమెంట్ షురూ అవుతుంది. ఈ టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ టెస్ట్ బ్యాటింగ్ కోచ్ గా బాధ్యతలు తీసుకుంటారు మైక్ స్మిత్. టెస్టుల్లో కూడా భయంకరమైన బ్యాటింగ్ చేసేలా బ్యాటర్లను సిద్ధం చేయడంలో మైక్ స్మిత్ దిట్ట అని కూడా పాక్ బోర్డు ప్రకటించింది. అందుకే అతన్ని తీసుకున్నట్లు పేర్కొంది.
పాకిస్తాన్ జట్టుకు టెస్టు బ్యాటింగ్ కోచ్ గా నియామకం అయిన మైక్ స్మిత్ పై ట్రోలింగ్ కూడా జరుగుతుంది. అతడు దక్షిణాఫ్రికా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ కావడం దీనికి కారణం. వాస్తవంగా పాకిస్తాన్ లాంటి వీక్ జట్టును… బలోపేతం చేసేందుకు గౌతమ్ గంభీర్ లాంటి బలమైన కోచ్ కావాలి. అయితే అలాంటి వాళ్ల కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా ప్రయత్నాలు చేసింది. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యాజమాన్యం తీరు నచ్చక చాలా మంది ఈ పోస్టు కోసం అప్లై చేయడం లేదు. యూనిస్ ఖాన్, షాహిద్ అఫ్రిది లాంటి వాళ్లు కూడా ఈ పదవిని రిజెక్ట్ చేశారు. ఇక దిక్కు లేక మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ను తీసుకువచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఆ మైక్ స్మిత్ ను తీసుకువచ్చి… డేంజర్ కోచ్ ను తీసుకు వచ్చినట్లు బిల్డప్ ఇస్తోంది.