BigTV English

Mitchell Owen : దరిద్రం అంటే ఇదే… పంజాబ్ టీంలో మరో మ్యాక్స్ వెల్ తేలాడు

Mitchell Owen : దరిద్రం అంటే ఇదే… పంజాబ్ టీంలో మరో మ్యాక్స్ వెల్ తేలాడు

Mitchell Owen : పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. 2014లో సెహ్వాగ్  పంజాబ్ కి ఆడిన సమయంలో పైనల్ కి వెళ్లి కోల్ కతా చేతిలో ఓడిపోయింది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా పంజాబ్ జట్టు ఫైనల్ కి చేరుకోలేదు. ఈ సారి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ జట్టు ఫైనల్ కి చేరుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పంజాబ్ జట్టు 17 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు పంజాబ్ ఢిల్లీ, ముంబై జట్లతో తలపడనుంది. ఈ రెండింటితో కచ్చితంగా విజయం సాధిస్తే.. పంజాబ్ నేరుగా ప్లే ఆప్స్ లో మొదటి స్థానంలోకి చేరుకుంటుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో స్థానం, ముంబై నాలుగో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.


Also Read :  Travis Head: SRHలో కరోనా కల్లోలం.. హెడ్ కు పాజిటివ్ !

ఇదిలా ఉంటే.. ఇవాళ జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బిగ్ బ్యాష్ హీరో 39 బంతుల్లో సెంచరీ సాధించిన.. 2024-25లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు మిచెల్ ఓవెన్ ఈ ఐపీఎల్ లొో ఇరగదీస్తాడనుకుంటే.. డకౌట్ అయి పరువు తీసుకున్నాడు. మిచెల్ ఓవెన్ ఐపీఎల్ లో ఆరంగేట్రం ముందు రకరకాల కామెంట్స్ వినిపించాయి. ఇంత హైప్ తో రాజస్థాన్ రాయల్స్ మీద ఆరంగేట్రం చేసిన ఓవెన్.. పంజాబ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశారు. కేవలం రెండు అంటే రెండు బంతులు మాత్రమే ఆడి డకౌట్ గా పెవిలియన్ కి చేరుకున్నాడు. మ్యాక్స్ వెల్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఓవెన్.. మరో మ్యాక్సిలా కాకూడదు అని పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గత సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కి ఆడి టైటిల్ అందించారు. ఈ సారి పంజాబ్ కింగ్స్ కి కూడా టైటిల్ అందిస్తారని పలువురు శ్రేయాస్ అయ్యర్ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టు కి ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా రాకపోవడంతో అభిమానులు సైతం ఈ సారి పంజాబ్ కి ఊహించని విధంగా టైటిల్ రావాలని కోరుకుంటున్నారు. అందరూ ఆటగాళ్లు ఇక నుంచి పట్టుదలతో శ్రమించి కీలక ఇన్నింగ్స్ ఆడితే కచ్చితంగా పంజాబ్ కింగ్స్ టైటిల్ వరించే అవకాశం కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ కి పోటీగా ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ లు మాత్రమే పోటీలో ఉన్నాయి. ఈ సీజన్ లో పంజాబ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి విజయం సాధించింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఈ సారి టైటిల్ గెలుస్తుందని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు. ఏదీ ఏమైనప్పటికీ ఇక నుంచి జరుగబోయే కీలక మ్యాచ్ ల్లో ఎవ్వరూ ఫామ్ లో ఉండి.. జట్టు కోసం పోరాడుతారో వారికే విజయం తప్పకుండా వరిస్తుందని చెప్పవచ్చు. ఈ సారి టైటిల్ విజేత ఎవరో తెలియాలంటే.. జూన్ 03 వరకు వేచి ఉండాల్సిందే.

Related News

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Big Stories

×