BigTV English

Shreyas Iyer : నీకు మాట ఇస్తున్న మిత్రబిందా.. ఈసారి పంజాబ్ దే కప్

Shreyas Iyer : నీకు మాట ఇస్తున్న మిత్రబిందా.. ఈసారి పంజాబ్ దే కప్

Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్.. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. గత సీజన్ లో శ్రేయాస్ కెప్టెన్ గా ఉండి కేకేఆర్ కి టైటిల్ అందించాడు. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ కి టైటిల్ అందేంచేందుకు తనవంతు పోరాటం చేస్తున్నాడు. అయితే పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు. కానీ  2014లో సెహ్వాగ్  పంజాబ్ కి ఆడిన సమయంలో పైనల్ కి వెళ్లి కోల్ కతా చేతిలో ఓడిపోయింది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా పంజాబ్ జట్టు ఫైనల్ కి చేరుకోలేదు. ఈ సారి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ జట్టు ఫైనల్ కి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పంజాబ్ జట్టు 17 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది.


Also Read :  Mitchell Owen : దరిద్రం అంటే ఇదే… పంజాబ్ టీంలో మరో మ్యాక్స్ వెల్ తేలాడు

ఇక పంజాబ్ కింగ్స్ తన తరువాత మ్యాచ్ ఈనెల 24న జైపూర్ వేదిక గా ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. అలాగే 26న కూడా జైపూర్ లో ముంబై ఇండియన్స్ తో పోటీ పడనుంది పంజాబ్ కింగ్స్. ఇక ఈ రెండు మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే.. ఇక పంజాబ్ కింగ్స్ కి తిరుగుండదు అనే చెప్పవచ్చు. ఒకవేళ ఈ రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలైతే మాత్రం పంజాబ్ కి కష్టాలు తప్పవు. కేవలం ఒక్క మ్యాచ్ లో గెలిచిన ప్లే ఆప్స్ అవకాశాలుంటాయి. ఇప్పటికే ప్లే ఆప్స్ రేసులో రాయల్ె ఛాలెంజర్స్ బెంగలూరు, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ వంటి జట్లు కాస్త ముందంజలో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాయి. పంజాబ్ కూడా ఇవాళ రాజస్థాన్ రాయల్స్ తో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.


మరోవైపు ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుదే ఈ సీజన్ టైటిల్ అన్న అభిమానులు.. ఇవాళ పంజాబ్.. రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించడంతో శ్రేయాస్ అభిమానులు, పంజాబ్ కింగ్స్ అభిమానులు అంతా ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ దే టైటిల్ అని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. మరోవైపు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. మెగా పవర్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మగధీర సినిమా తరహాలో ప్రీతి జింటా కి మాట ఇచ్చాడు. నీకు మాట ఇస్తున్న మిత్రబిందా.. ఈ సారి పంజాబ్ దే కప్ అని పేర్కొన్నారు శ్రేయాస్ అయ్యర్.. మగధీర సినిమాలో కాజల్ కూడా నాకు మాట ఇవ్వు బైరవ అన్నట్టుగా.. ఈ సీజన్ కప్ కొడుతా అని నాకు మాట ఇవ్వు బైరవా..? అనే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాట ఇస్తున్న యువరాణి.. నీ చేతిలో కప్ పెడతానని శ్రేయాస్ అయ్యర్ ప్రీతి జింటా కి మాట ఇచ్చాడు. గత సీజన్ లో కేకేఆర్ టైటిల్ సాధించినట్టుగానే.. ఈ సారి పంజాబ్ కింగ్స్ కి కూడా శ్రేయాస్ అయ్యర్ టైటిల్ సాధిస్తాడనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. పంజాబ్ కింగ్స్ టైటిల్ సాధిస్తుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×