BigTV English

Mitchell Starc : కుశాల్ పెరీరా ఇదేం పని? స్టార్క్ క్రీడాస్ఫూర్తి.. నెటిజన్లు ప్రశంసలు..

Mitchell Starc : కుశాల్ పెరీరా ఇదేం పని? స్టార్క్ క్రీడాస్ఫూర్తి.. నెటిజన్లు ప్రశంసలు..

Mitchell Starc: ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచ్ లో క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిన సంఘటన ఒకటి జరిగింది. టాస్ గెలిచి  శ్రీలంక ఓపెనర్లు బ్యాటింగ్ ప్రారంభించారు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్టార్క్ అవతలి ఎండ్ నుంచి బౌలింగ్ ప్రారంభించాడు. రన్నప్ తీసుకుంటూ వచ్చి సడన్ గా ఆగిపోయాడు. అందరూ ఏమిటి కారణమని చూశారు. విషయం ఏమిటంటే తను బాల్ వేయకుండానే కుశాల్ పెరీరా రన్ కోసం క్రీజు దాటేస్తూ కనిపించాడు. అతనికి వార్నింగ్ ఇవ్వడానికి బాల్ వేయకుండా ఆగిపోయాడు.


నిజానికి బాల్ డెలివరీ అయ్యాక తను రన్నప్ ఇవ్వాలి.  
కానీ ఇక్కడింకా కవిత షురూ సేయకుండానే… అప్పుడే వా…వా..అన్నట్టు…
బౌలర్ పరిగెత్తకుండానే…రన్ కోసం బ్యాట్స్ మెన్ పరిగెట్టేస్తే ఎలాగుంటది…బౌలర్ కి వళ్లు మండిపోద్ది కదా…
అప్పటికే ఓపెనర్లు ఇద్దరూ కొట్టే ఎడాపెడా ఫోర్లకి ఫెడప్ అయి ఉన్న స్టార్క్ ఏం చేశాడంటే పెరీరాకి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చాడు. నిజానికి మన్కడింగ్ (రనౌట్) చేయవచ్చు. కానీ అది క్రీడాస్ఫూర్తికి విరుద్దమని భావించి తొలి అవకాశం ఇచ్చాడు.

ఇలా కొంత సేపు ఆట జరిగింది. ఐదో ఓవర్ వచ్చింది. మళ్లీ తమ్ముడు కుశాల్ బంతి వేయకుండానే క్రీజు దాటేశాడు. మళ్లీ ఇది గమనించిన స్టార్క్ మరో అవకాశం ఇచ్చాడు. ఈసారి గట్టి వార్నింగ్ ఇవ్వడమే కాదు. థర్డ్ అంపైర్ కి కంప్లయింట్ కూడా చేశాడు. కానీ ఇంత జరుగుతున్నా కుశాల్ లో ఏ మాత్రం వీసమెత్తయినా అపరాధ భావం కలగలేదు. స్టార్క్ చెబుతూనే ఉన్నాడు. తను చేసేది చేస్తూనే ఉన్నాడు.


 అయితే మూడో తప్పిదం కుశాల్ చేయలేదు. ఒకవేళ చేసి ఉంటే స్టార్క్ అవుట్ చేసేవాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు అతని క్రీడా స్ఫూర్తిని మెచ్చుకుంటూ పోస్టింగుల మీద పోస్టింగులు పెడుతున్నారు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×