Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 ) కంటే ముందు… ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇది మామూలు దెబ్బ కాదు… పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటు నుంచి ఏకంగా ఆరుగురు ప్లేయర్లు దూరమయ్యారు. మొన్నటి వరకు ముగ్గురు ప్లేయర్లు దూరం అవుతారని అందరూ అనుకున్నారు. కానీ చాంపియన్స్ ట్రోఫీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ సంఖ్య పెరిగింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు నుంచి… ఇప్పుడు ఏకంగా ఆరుగురు ప్లేయర్లు దూరం కాబోతున్నారు.
Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా దూరం.. అతను వస్తున్నాడు ?
తాజాగా.. డేంజర్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా… చాంపియస్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటన వచ్చింది. తన ఫ్యామిలీ సమస్యల కారణంగా… ఈసారి టోర్నమెంట్ కు దూరం కాబోతున్నాడట మిచెల్ స్టార్క్ ( MITCHELL STARC ) ఈ మేరకు ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది. మిచెల్ స్టార్క్ బయటికి వెళ్లడంతో… చాంపియన్స్ ట్రోఫీ నుంచి మొత్తం ఆరుగురు ఆస్ట్రేలియా ప్లేయర్లు… దూరం కాబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే… ఆస్ట్రేలియా సక్సెస్ఫుల్ కెప్టెన్…పాట్ కమిన్స్ అలాగే జోష్ హాజల్ వుడ్, మిచెల్ మార్ష్, కామెరూన్ గ్రీన్, మర్కస్టోయినోస్ లాంటి ప్లేయర్లు ఇప్పటికే దూరమైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో మార్కస్ స్టోయినోస్ రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో అతడు కూడా టోర్నమెంట్ వదలాల్సి వచ్చింది. ఇలా ఏకంగా ఆరుగురు ప్లేయర్లు ఆస్ట్రేలియాకు దూరం కావడం ఆ జట్టుకు పెద్దదెబ్బే అని చెప్పవచ్చు.
ఐసీసీ ట్రోఫీలలో ఆస్ట్రేలియా కచ్చితంగా ఫైనల్ దాక వెళ్లే ఛాన్సులు ఉంటాయి. అలాంటి జట్టు ఇప్పుడు వరుస ఎదురుదెబ్బలను ఎదుర్కొంటోంది. దీంతో ఈసారి ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా… ఏమాత్రం పోటీ ఇవ్వబోదని అంటున్నారు. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ దూరం కావడంతో… అతని స్థానంలో స్టీవెన్ స్మిత్ ను కెప్టెన్ గా నియామకం చేశారు. ఈ మేరకు తుది జట్టును కూడా ఫైనల్ చేసింది ఆస్ట్రేలియా.
ఇది ఇలా ఉండగా చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ అతి త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 19వ తేదీ నుంచి… మార్చి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. హైబ్రిడ్ మోడల్ లో ఈ టోర్నమెంట్ జరగనుంది. అంటే టీమిండియా ఆడే మ్యాచ్ లన్ని దుబాయ్ వేదికగా జరుగుతాయి. మిగతా మ్యాచ్ లన్ని పాకిస్తాన్ లో జరగనున్నాయి. భారతదేశం అలాగే పాకిస్తాన్ మధ్య సరిహద్దు సమస్యలు… ఉన్న తరణంలో హైబ్రిడ్ మోడల్ కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ టోర్నమెంటులో టీమిండియా సెమీఫైనల్ లేదా ఫైనల్ కు చేరితే ఖచ్చితంగా ఆ మ్యాచులు దుబాయిలో జరుగుతాయి. లేకపో తే పాకిస్తాన్ లో మ్యాచ్ లన్ని జరుగుతాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ మిస్ అవుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్స్
– పాట్ కమిన్స్
– జోష్ హాజెల్‌వుడ్
– మిచెల్ స్టార్క్
– మిచెల్ మార్ష్
– కామెరాన్ గ్రీన్
– మార్కస్ స్టోయినిస్
Also Read: Rohit Sharma Mobile: కోట్లు సంపాదిస్తున్న చీప్ ఫోన్ వాడుతున్న రోహిత్.. ధర ఎంతంటే ?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఆస్ట్రేలియా స్క్వాడ్:
స్టీవ్ స్మిత్ (సి), హెడ్, మాక్స్‌వెల్, లాబుస్‌చాగ్నే, కారీ, అబాట్, ఎల్లిస్, జేక్ ఫ్రేజర్, హార్డీ, ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, సంఘా, షార్ట్, జంపా, ద్వార్షుయిస్.
AUSTRALIA SQUAD FOR CHAMPIONS TROPHY 2025: 🏆
Steve Smith (C), Head, Maxwell, Labuschagne, Carey, Abbott, Ellis, Jake Fraser, Hardie, Inglis, Spencer Johnson, Sangha, Short, Zampa, Dwarshuis. pic.twitter.com/WbMD6OGwjx
— Tanuj Singh (@ImTanujSingh) February 12, 2025
🚨 BIG MISS FOR AUSTRALIA IN CHAMPIONS TROPHY 🚨
– Pat Cummins ruled out.
– Josh Hazelwood ruled out.
– Mitchell Starc ruled out.
– Mitchell Marsh ruled out.
– Cameron Green ruled out.
– Marcus Stoinis retired. pic.twitter.com/yVXwWDMjzB— Tanuj Singh (@ImTanujSingh) February 12, 2025