NHAI E TOLL CARD: నిత్యం హైవేస్ మీద ప్రయాణం చేసే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. లైఫ్ టైమ్ టోల్ పాస్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇంతకీ ఈ పాస్ ఎందుకు తీసుకొస్తుంది? దాని వల్ల కలిగే లాభం ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
లైఫ్ టైమ్ టోల్ పాస్
సాధారణంగా వాహనాలు టోల్ గేట్ దాటి వెళ్లే సమయంలో టోల్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో మ్యాన్యువల్ గా ఈ డబ్బులు చెల్లించే వాళ్లు, ఆ తర్వాత ఫాస్ట్ టాగ్ అందుబాటులోకి వచ్చింది. ఈ చిప్ సిస్టమ్ ద్వారా టోల్ గేట్ దగ్గర ఆగకుండానే వెళ్లే అవకాశం ఉంటుంది. టోల్ గేట్ దాటగానే ఆటో మేటిక్ గా డబ్బులు కట్ అవుతాయి. అయితే, ఇప్పుడు వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఒకేసారి రూ. 30,000 చెల్లిస్తే 15 ఏళ్ల పాటు దేశంలోని ఏ టోల్ ప్లాజానైనా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా క్రాస్ చేసి వెళ్లొచ్చు. ఎలాంటి కండీషన్ లేకుండా, ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు ఉచితంగా వెళ్లే అవకాశం ఉంటుంది.
అదనపు పాస్ ను తీసుకోవాల్సిన అవసరం లేదు!
ఇక ఈ సదుపాయాన్ని పొందేందుకు అదనపు పాస్ ను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ – టోల్ కార్డ్ అనే పాస్ ఆటోమేటిక్ గా మీ ఫాస్ట్ ట్యాగ్ కార్డుకు లింక్ అయి ఉంటుంది. ఒకవేళ లైఫ్ టైమ్ పాస్ వద్దు అనుకున్న వాళ్లు ఏడాది పాస్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఏడాదికి ఒకేసారి రూ. 3,000 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత దేశంలోని ఏ టోల్ గేట్ నైనా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా దాటే అవకాశం ఉంటుంది.
Read Also: ట్రావెల్ ఏజెంట్లలో జాగ్రత్త, ఆ టికెట్స్ మిస్ యూజ్ కావద్దంటూ ఇండియన్ రైల్వే వార్నింగ్!
ఈ టోల్ కార్డుతో లాభం ఏంటి?
15 ఏండ్లు లేదంటే ఏడాది పాటు తీసుకుని ఈ టోల్ కార్డు కారణంగా చాలా లాభాలు ఉన్నాయి. ప్రతిసారి కార్డులో బ్యాలెన్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి రోజు టోల్ ప్లాజాను దాటి వెళ్లే వారికి చాలా డబ్బు ఆదా అవుతుంది. ఈ సదుపాయం కేవలం కారు ఓనర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. క్యాబ్ లు, లారీలు, బస్సులు, ట్రక్కులకు ఈ అవకాశం లేదు. సో, ఇకపై నిత్యం ప్రయాణాలు చేసే వారు ఈ కార్డును తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఈ కార్డు వల్ల కారు ఓనర్లతో పాటు ప్రభుత్వానికి కూడా చాలా లాభం కలుగుతుంది.
Read Also: ఆధార్ ఒక్కటే కాదు, వాటితోనూ బస్సుల్లో ఫ్రీగా వెళ్లొచ్చు, అసలు విషయం చెప్పిన ఆర్టీసీ ఎండీ!