E-Paper
Advertisement

ఒరేయ్ తిల‌క్ వ‌ర్మ‌..టెస్టు మ్యాచ్ ఆడుతున్నావా? చేత‌కాక‌పోతే త‌ప్పుకో!

ఒరేయ్ తిల‌క్ వ‌ర్మ‌..టెస్టు మ్యాచ్ ఆడుతున్నావా? చేత‌కాక‌పోతే త‌ప్పుకో!
Advertisement

Mohammad Kaif brutally Cooked Tilak Varma:  రైసింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో (ACC Men’s Asia Cup Rising Stars 2026) భాగంగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా (India A vs Pakistan A, 8th Match) మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో తిలక్ వర్మ ( Tilak Varma ) బ్యాటింగ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. చేజింగ్ సమయంలో స్లోగా బ్యాటింగ్ చేస్తున్నాడని క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం చేస్తున్నారు.

ఒరేయ్ తిల‌క్ వ‌ర్మ‌..టెస్టు మ్యాచ్ ఆడుతున్నావా? మ‌హ్మ‌ద్ కైఫ్ సీరియ‌స్‌

ఇక హిందీ కామెంట్రీ చేస్తున్న మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif ) కూడా తిలక్ వర్మ బ్యాటింగ్ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీ20, వన్డేల‌ను తిలక్ వర్మ టెస్టుల్లా ఆడతాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అభిషేక్ శర్మ 34 బంతుల్లో 60 పరుగులు సాధిస్తే.. తిలక్ వర్మ 35 బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే బాదాడని ఫైర్ అయ్యాడు. వన్డేలను టెస్టుల్లా మార్చేశాడని విమర్శించాడు. దీంతో తిలక్ వర్మపై మహమ్మద్ కైఫ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 313 పరుగులు చేసి ఆలౌటైంది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టాప్ ఆర్డర్ విఫలం కావడంతో టీమిండియా పీక‌ల్లోతు కష్టాల్లో పడింది. అభిషేక్ శర్మ ఒక్కడే రాణించినప్పటికీ 129 పరుగులు చేసిన క్రమంలో ఆరు వికెట్లు కోల్పోయింది భారత్. వికెట్లు పడుతున్న క్రమంలో కాస్త మెల్లిగా ఆడుతున్న తిలక్ వర్మ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి తోడుగా షాబాజ్ అహ్మద్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ చివరి వరకు నిలబడితే మ్యాచ్ సులభంగా గెలవచ్చు. 71 బంతుల్లో మ‌రో 99 పరుగులు చేస్తే టీమిండియా గెలవనుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ మినీ యుద్ధాన్ని తలపిస్తోంది. ప్రతి బంతికి ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. ముఖ్యంగా హర్షిత్ రాణా వర్సెస్ పాకిస్తాన్ ప్లేయర్ల మధ్య మాటల యుద్ధం ఈ మ్యాచ్ ప్రారంభమైన నుంచి చివరి వరకు కొనసాగింది. హర్షిత్ రాణా బౌలింగ్ లో చితక బాదుతామని పాకిస్తాన్ బ్యాటర్లు రెచ్చగొడితే… అదే స్థాయిలో అతడు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అటు వైభవ్ సూర్యవంశీ 11 పరుగుల వద్ద వికెట్ కోల్పోయిన క్రమంలో దారుణంగా పాకిస్తాన్ ప్లేయ‌ర్లు ర్యాగింగ్ చేసి రచ్చ చేశారు. ఇలా బంతి బంతికి వివాదం చోటు చేసుకుంటూనే ఉంది.

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

 

Related News

వైభ‌వ్ మ‌రోసారి ఫ్లాప్..స్కూల్ కు వెళ్లి ఆడుకోరా అంటూ పాక్ ప్లేయ‌ర్ల ర్యాగింగ్

తొలి బంతి నుంచి స్లెండ్జింగా? హ‌ర్షిత్ రాణాపై 2 ఏళ్లు బ్యాన్ వేయాల్సిందే

చ‌ల్ దొబ్బేయండిరా…పాకిస్తాన్ బ్యాట‌ర్ల‌కు న‌ర‌కం చూపించిన హ‌ర్షిత్ రాణా

ఆసియా క‌ప్ మ్యాచ్ లో టాస్ వివాదం..టీమిండియా ఫిక్సింగ్ చేసిందంటూ పాక్ విమ‌ర్శ‌లు

గిల్ కు ఇంత పొగ‌రా…వికెట్ల వీరుడు సిరాజ్ ను వాట‌ర్ బాయ్ వాడ‌తావా? అంటూ ట్రోల్స్

టెస్టుల్లో పంత్ హీరోనే, కానీ వ‌న్డేలు, టీ20ల్లో మాత్రం కుంభకర్ణుడు

షోయ‌బ్ అక్త‌ర్ తో క‌లిసి కామెంట్రీ…హ‌ర్భ‌జ‌న్ సింగ్ దేశ ద్రోహి అంటూ విమ‌ర్శ‌లు!

Big Stories

Advertisement
×